
సాక్షి, అమరావతి: ఈసారి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్ నెలల మధ్య ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అప్పట్లో ఈ ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
అయితే, వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు ఈసారి ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకవేళ తల్లి మరణిస్తే పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ములు లేదా గార్డియన్‌గా వ్యవహరించే ఇతరులకు ఆ ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment