పేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం పెళ్లి కానుక | CM Jagan Release YSR Kalyanamasthu YSR Shaadi Tohfa Funds Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా విడుదల

Published Tue, Feb 20 2024 10:37 AM | Last Updated on Tue, Feb 20 2024 12:59 PM

CM Jagan Release YSR Kalyanamasthu YSR Shaadi Tohfa Funds Updates - Sakshi

గుంటూరు, సాక్షి: పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని.. అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం వైఎస్సార్‌ కల్యాణమస్తు.. వైఎస్సార్‌ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో ఆయన జమ చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ..

‘‘దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతోంది.  వైఎస్సార్ కల్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికీ పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ కచ్చితంగా పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని పెట్టాం.దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ్‌లో ఎలిజబులిటీ రావాలంటే కచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుంది. 

.. 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల పదో తరగతి ముందే 15 ఏళ్లు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్ కు అనర్హులు కాబట్టి, ఇంటర్ మీడియట్‌కు పంపితే అమ్మ ఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మ ఒడి ద్వారా మంచి జరుగుతుంది. కచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. 

.. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్సుమెంట్ ఇచ్చే విద్యాదీవెన ఉంది.  అదేమాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఇస్తున్నాం. ఈ రెండు స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపా, ప్రతి పిల్లాడూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నాం. కచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్ లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు. 

మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. 

బాబు హయంలో కంటే పెంచి.. 
చంద్రబాబు హయాంలో ఇది నామ్ కే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్లు ఇచ్చేట్టుగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోయాం.  గతంలో 40 వేలకు పరిమితమైన ఎస్సీలకు రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతా పెళ్లి అయితే రూ.1.20 లక్షల వరకు తీసుకుపోయాం.ఎస్టీలకు రూ.50 వేలకు పరిమితమైతే రూ.లక్ష దాకా తీసుకుపోయాం. కులాంతర వివాహం అయితే రూ.1.20 లక్షల దాకా తీసుకుపోయాం. గతంలో బీసీలకు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుంటే దాన్ని రూ.50 వేల వరకు తీసుకుని పోవడం, కులాంతర వివాహం అయితే దాన్ని రూ.75 వేల దాకా తీసుకుపోయాం. దివ్యాంగులకు ఏకంగా రూ.1.50 లక్షల దాకా తీసుకుపోయాం. వాళ్ల కుటుంబాల్లో ఏ ఒక్కరూ, తల్లిదండ్రులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదని సబ్‌స్టాన్సియల్ అమౌంట్ పెంచి ఇస్తున్నాం.  చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను అడుగులు వేయిస్తాయన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 

గతంలో అరకొరగా ఇస్తున్న పరిస్థితులు.. దాదాపు 17,709 మంది పిల్లలకు ఇచ్చే అరకొర కూడా దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా ఇది 5వ విడత. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించినది ఈరోజు ఇస్తున్నాం. దాదాపు రూ.78 కోట్లు ఇస్తున్నాం. ఇంత వరకు 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ రూ.427 కోట్లు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులు ప్రోత్సహించేందుకుమరో ముందడుగు వేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని వల్ల అందరికీ మంచి జరగాలని, ఈ క్వార్టర్ లో ఏకమైన ఈ పిల్లలకు, తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఇంకా మంచి జరగాలని వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా ఇంకా మంచి జరగాలని, మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని సీఎం జగన్‌ ప్రసంగించారు. 

చదువులకు మరింత ఊతమిస్తూనే..
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు "వైఎస్సార్ షాదీ తోఫా" ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గతంలో కంటే..  
గత పాలనలో 17,709 మంది అర్హులకు రూ. 68.68 కోట్ల లబ్ధి ఇవ్వకుండా వదిలేశారు. అయితే సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తున్నారు. 

  • ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 40,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
  • ఎస్సీ (కులాంతర వివాహం)  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
  • ఎస్టీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
  • ఎస్టీ (కులాంతర వివాహం)  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 75,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,20,000
  • బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 35,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 50,000
  • బీసీ (కులాంతర వివాహం)  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000
  • మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000
  • విభిన్న ప్రతిభావంతులు  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 1,00,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000
  • భవన, ఇతర నిర్మాణ కార్మికులు  గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 20,000 జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 40,000

తొలి దఫా..  జమ చేసిన తేదీ (10.02.2023) లబ్ధిదారులు 4,536, అందించిన మొత్తం రూ. కోట్లలో 38.18 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్ – డిసెంబర్ 2022)
రెండో దఫా..  జమ చేసిన తేదీ (05.05.2023) లబ్ధిదారులు 12,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 87.32 (వివాహం జరిగిన త్రైమాసికం జనవరి-మార్చి 2023)
మూడో దఫా.. జమ చేసిన తేదీ (09.08.2023) లబ్ధిదారులు 18,883, అందించిన మొత్తం రూ. కోట్లలో 141.60 (వివాహం జరిగిన త్రైమాసికం ఏప్రిల్-జూన్ 2023)
నాలుగో దఫా..  జమ చేసిన తేదీ (23.11.2023) లబ్ధిదారులు 10,511, అందించిన మొత్తం రూ. కోట్లలో 81.64 (వివాహం జరిగిన త్రైమాసికం జులై-సెప్టెంబర్ 2023)
ఐదో దఫా..  జమ చేసిన తేదీ (20.02.2024) లబ్ధిదారులు 10,132, అందించిన మొత్తం రూ. కోట్లలో 78.53 (వివాహం జరిగిన త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023)

మొత్తం లబ్ధిదారులు 56,194 అందించిన మొత్తం రూ. కోట్లలో 427.27

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement