సాక్షి, గుంటూరు: పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం మరో విడుత లబ్దిదారులకు అందనుంది. రేపు(బుధవారం) వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదు జమ చేస్తారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల్లో భాగంగా.. అర్హులైన 18,883 జంటలకు లబ్ధి చేకూర్చనున్నారు. ఇందుకోసం రూ. 141.60 కోట్లు ఖర్చు చేయనుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా, అలాగే.. ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం.
ఇదీ చదవండి: ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు!
Comments
Please login to add a commentAdd a comment