సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం. ఈ క్రమంలో కనీసం పదో తరగతి అయిన పేద పిల్లలు చదువుకుంటారు. టెన్త్ కచ్చితంగా చదివి ఉంటేనే కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం అందుతుంది. ఇలా, టెన్త్ చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో మొదలవుతుంది. ఈ పథకాలకు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించాం.
18 ఏళ్ల నిబంధన వల్ల చదువులు ముందుకు సాగుతాయి. కనీసం డిగ్రీ వరకు చదివే వెసులుబాటు ఉంటుంది. చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుంది. విద్యాదీవెన, వసతి దీవెన ఉండటం వల్ల కనీసం డిగ్రీ వరకు చదువుతారు. డిగ్రీ వరకు పిల్లల చదవుల భారం ప్రభుత్వమే భరిస్తుంది. అమ్మఒడి మరో ప్రోత్సాహకరంగా ఉంటుంది అని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌తో లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మా కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
- ఎలాగూ మనం అమ్మ ఒడి ఇస్తున్నాం
- ఇంటర్మీడియట్ అయ్యాక.. ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింపచేస్తున్నాం
- జగనన్న వసతి దీవెనకూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నాం
- ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయి
- జగనన్న అమ్మఒడిఒక ప్రోత్సాహకంగా నిలిస్తే, రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది
- ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుంది
- ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయి
- ఇంతకుముందు ప్రభుత్వం ఎన్నికలకోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసింది
- 17709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టింది
- దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టింది
- ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం
- ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నాం
- ఎస్టీలకు గతంలో రూ. 50వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బుకూడా ఇవ్వలేదు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచాం
- బీసీలకు గతంలో రూ.35వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50వేలకు పెంచాం
- అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం
- ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచాం
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇది కూడా చదవండి: అకాల కష్టం అండగా ఉందాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment