
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణగదొక్కబడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబును ప్రజలు బహిష్కరించే పరిస్థితి వస్తుంది. నోరు ఉంది కదా అని ఎలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుందనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు బ్రతుకే హింసాత్మకమైనది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. కన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. మాది కూడా గుంటూరు జిల్లానే.
అసలు కన్నా లక్ష్మీనారాయణ ఎవరు? ఆయన క్యారెక్టర్ ఏంటి అని ప్రశ్నించారు. కన్నా ఆటలు మా దగ్గర సాగవు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment