
సాక్షి, త్రిపురాంతకం: మతి స్థిమితంలేని యువతిపై మద్యం మత్తులో యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. త్రిపురాంతకం మండలానికి చెందిన యువకుడు ఎ.కరుణాకరరెడ్డి (23) శుక్రవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంటికి సమీపంలో ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న మతిస్థిమితం లేని 20 ఏళ్ల యువతిని బలవంతంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బట్టీ పనులు ముగించుకుని ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులకు కుమార్తె కనిపించకపోవడంతో ఇంటి వద్ద వెతగ్గా..పక్కన ఉన్న ఖాళీ స్థలం నుంచి బయటకు వస్తూ కనిపించింది. విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment