
సాక్షి, బల్లికురవ: ఓ వ్యక్తి పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో లొంగదీసుకుని వారం రోజుల పాటు తన చుట్టూ తిప్పుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ పాడి అంకమ్మరావు కథనం ప్రకారం.. కూకట్లపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన కొత్త ఏసోబుతో నెల క్రితం బాలికకు పరిచయమైంది. తరుచూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
ఈ నెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న బాలికను మాయ మాటలతో ఏసోబు బయటకు తీసుకెళ్లాడు చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడి చివరకు గ్రామ సమీపంలో వదిలి పెట్టి వెళ్లాడు. బిడ్డ ఏమైందోనని వారం రోజులుగా తల్లిదండ్రులు వాకబు చేశారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసినా ఫలితం లేదు. చివరకు బాలిక రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్ష కోసం అద్దంకి వైద్యశాలకు పంపినట్లు వివరించారు
Comments
Please login to add a commentAdd a comment