
గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. జనసేన పార్టీ పెట్టి.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.
చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్