సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మలేరియా,డెంగీ జ‍్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా వాటర్ ట్యాంకుల్లో క్లోరిన్ వేసి శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ‘నాలుగైదు రోజుల్లో గ్రామాల్లో పర్యటిస్తానని..అవసరమైతే పల్లెనిద్ర’ కూడా చేస్తానని తెలిపారు. సీజనల్ వ్యాధులను నివారించడానికి రేపటి నుంచి మూడురోజుల పాటు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా..మందులను 24 గంటలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment