సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై రాజకీయ కుట్ర సాగుతుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు సోమవారం ఆయన విశాఖ శారద పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యమంత్రి చేపట్టే సంక్షేమ పథకాలకు ఆశీస్సులు కావాలని స్వామిని కోరామని తెలిపారు. కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరిగాయని.. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. రాజకీయ కుట్రతో ప్రజలను అయోమయం చేసే ఘటనలు జరిగాయన్నారు. ఈ కుట్రలను ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..)
‘‘కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారు. ఆలయాలను పున:నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని’’ ఆయన తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తామన్నారు. చంద్రబాబుకు హిందువులపై ప్రేమ లేదని.. ఆయన ట్వీట్లు పట్టించుకోవద్దని ప్రజలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం)
Comments
Please login to add a commentAdd a comment