
సాక్షి, గుంటూరు: బంగాళఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు, వరదలకు పంటపొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. వరదలకు నీట మునిగిన పంటపొలాలను, లంక గ్రామాలను పరిశీలించారు. గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రుతో పాటు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉన్నారు. అదే విధంగా మంత్రులు, అధికారులు చిర్రావూరు, బొమ్మ వాణి పాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, వెల్లటూరు పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment