
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో 25 లక్షలమందికి ఇంటి నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఏలూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 34,879 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. 1,12,700 మంది ఇళ్ల స్థలాలు ఉండి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒంటరి, వితంతు, వికలాంగులకు ఇంటి నిర్మాణం పూర్తిగా ప్రభుత్వమే నిర్మించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. భూ సేకరణ, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం ద్వారా ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment