సాక్షి, గుంటూరు: మహమ్మారి కోవిడ్-19 సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీజీహెచ్ తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాని కోసం వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు రూ.కోటి విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment