అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం  | Minister Sri Ranganatha Raju Comments Over Antarvedi Temple Chariot Fire Issue | Sakshi
Sakshi News home page

అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం 

Published Mon, Sep 21 2020 3:23 PM | Last Updated on Mon, Sep 21 2020 3:33 PM

Minister Sri Ranganatha Raju Comments Over Antarvedi Temple Chariot Fire Issue - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం.. కొన్ని దుష్ట శక్తుల పనని, ఆ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని మంత్రి శ్రీ రంగనాథ్‌ రాజు తెలిపారు. త్వరలోనే రథం దగ్ధం చేసిన కుట్రదారులను పట్టుకుంటామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు కులాలు, మతాలు ఉండవన్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్లను కూల దోస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

చదవండి : దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement