antharvedi lakshmi narasimha swamy
-
నయనానందకరం నృసింహుని కల్యాణం
సాక్షి అమలాపురం: పరమ పవిత్ర వశిష్ట నదీ తీరంలో నృశింహుని కల్యాణం నయనానందకరంగా జరిగింది. సముద్ర సంగమ ప్రాంతం అంతర్వేది పుణ్య క్షేత్రం పులకరించిపోయింది. అసంఖ్యాకంగా వచ్చిన భక్తులు నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణాన్ని తన్మయత్వంతో వీక్షించారు. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం మంగళవారం రాత్రి 12.46 గంటలకు రోహిణి నక్షతయుక్త తులా లగ్న పుష్కరాంశంలో అంగరంగ వైభవంగా జరిగింది. వైష్ణవ సంప్రదాయబద్దంగా వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకట శాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణం జరిగినంత సేపూ మొగల్తూరుకు చెందిన ఆలయం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్ చేతులు కట్టుకొని స్వామివారి చెంత నిలబడి భక్తిశ్రద్ధలతో కొలిచారు. టీటీడీ, అన్నవరం దేవస్థానం శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించాయి. నాలుగు గంటల పాటు సాగిన కల్యాణాన్ని చూసి భక్తులు మురిసిపోయారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై అర్చకులు శ్రీస్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ మెడలో ఆవిష్కరించే గజమాల యాత్ర ఊరేగింపు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. -
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో సజ్జల
-
అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం
సాక్షి, విశాఖపట్నం : అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం.. కొన్ని దుష్ట శక్తుల పనని, ఆ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని మంత్రి శ్రీ రంగనాథ్ రాజు తెలిపారు. త్వరలోనే రథం దగ్ధం చేసిన కుట్రదారులను పట్టుకుంటామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు కులాలు, మతాలు ఉండవన్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్లను కూల దోస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చదవండి : దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ -
ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం
సాక్షి, విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. (అంతర్వేది ఆలయ రథం దగ్ధం) హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్‌కు సవాల్ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు. రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
అంతర్వేది ఘటనపై అంతర్గత కమిటీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం) ఈ సంఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా ఎక్కడా ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ, చెత్తను పోగు చేసి మంట పెడుతున్నట్టు గుర్తించారు. రథం దగ్ధం సంఘటన జరిగిన శనివారం రాత్రి ఆ వ్యక్తి మంటలు.. మంటలు.. అంటూ కేకలు వేస్తూ వెళ్లాడని అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనలో కుట్రకోణం ఏమీ లేదని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఒకపక్క పోలీసులు, మరోపక్క రెవెన్యూ అధికారులు ఈ మిస్టరీని ఛేదించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ధ్రువీకరించారు. (చదవండి: కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్) -
అంతర్వేది ఆలయ రథం దగ్ధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం/సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం శనివారం అర్ధరాత్రి దగ్ధమైంది. రథంపై ఏటా కల్యాణోత్సవాల తరువాత స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవోపేతంగా జరుగుతుంది. రథం దగ్ధం కావడంతో ఆదివారం భక్తులు ఆలయం వద్దకు చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న పెద్ద షెడ్లో ఉంచారు. రథం వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చేలోపే రథం ఆహుతైంది. తేనెపట్టు సేకరణ వల్లే..: రథం షెడ్డులో ఉన్న తేనెపట్టును సేకరించేందుకు కొందరు చేసిన యత్నం ఏకంగా రథం దగ్ధానికి కారణమైనట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రథం ఎత్తుతో సమానంగా షెడ్డును ఇక్కడ నిర్మించారు. ఏటా ఉత్సవాలు పూర్తయ్యాక ఈ షెడ్డులో రథాన్ని ఉంచుతారు. షెడ్డు ఒకవైపు తెరచి, మూడువైపుల మూసి ఉంటుంది. తెరచి ఉంచిన వైపు రథాన్ని తాటాకులతో కప్పి ఉంచుతారు. షెడ్డులో ఇటీవల తేనెపట్టులు పట్టాయి. తేనెను పట్టుకునేందుకు శనివారం రాత్రి కొందరు విఫలయత్నం చేశారు. 20 అడుగులున్న గెడ తెచ్చి, దానికి కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడాతో తేనెటీగలను చెదరగొట్టే యత్నం చేశారు. కాగడా ప్రమాదవశాత్తూ ఊడిపోయి, రథానికి ఒకవైపు ఉన్న తాటాకులపై పడింది. దీంతో మంటలు లేచాయి. ఈ మంటలకు రథం దగ్థమైంది. విజయవాడ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులకు దీనిపై ఆధారాలు లభించినట్లు తెలిసింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక, దేవదాయ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వెలంపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఘటనపై దేవదాయ కమిషనర్ అర్జునరావుతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. కొత్త రథం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్‌కు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ: డీజీపీ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం ప్రమాద ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. దీనిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు తెలిపారు. సఖినేటిపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఘటనలో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదన్నారు. -
బస్సు యాత్ర ప్రారంభం
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘సమైక్య రాష్ట్రమే మా లక్ష్యం.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిద్దాం’ అంటూ ఆది దేవుడు అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి సన్ని ధి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ చేపట్టిన బస్సు యాత్రల్లో భాగంగా అమలాపురం పరిధిలో తొలిరోజైన శుక్రవారం రాజోలు నియోజకవర్గంలో యాత్ర ఆరంభమైంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు జెండా ఊపి బస్సుయాత్రను ప్రారంభించారు. యాత్రకు ముం దుగా వందలాది మంది యువకులు మోటార్ బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు సమైక్యాంధ్రకు, జగన్, విజయమ్మలకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీలకతీతంగా సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు. తొలుత అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, బస్సుయాత్ర విజ యవంతం కావాలని పూజలు చేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ మంత్రి విశ్వరూప్ పదవిని కాపాడుకునేందుకు చిత్త శుద్ధిలేని రాజీనామా చేశారని విమర్శించా రు. గొంది, సఖినేటిపల్లి, టేకిశెట్టిపాలెం, మలికిపురం, రాజోలు, తాటిపాక సెంటరు మీదుగా మామిడికుదురు వరకు యాత్ర సాగింది. మలికిపురం సెంటర్లో వంటావార్పు నిర్వహించి, రోడ్డుపైనే భోజనాలు చేశారు. అంతర్వేది ఆలయంలో పూజలు, టేకిశెట్టిపాలెం చర్చిలోను, మామిడికుదురు సున్ని జామియా మసీదు, షియా జామియా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. రాజోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. మామిడికుదురు సెంటరులో ధర్నా చేశారు.