అమలాపురం, న్యూస్‌లైన్ : ‘సమైక్య రాష్ట్రమే మా లక్ష్యం.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిద్దాం’ అంటూ ఆది దేవుడు అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి సన్ని ధి నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ చేపట్టిన బస్సు యాత్రల్లో భాగంగా అమలాపురం పరిధిలో తొలిరోజైన శుక్రవారం రాజోలు నియోజకవర్గంలో యాత్ర ఆరంభమైంది. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు జెండా ఊపి బస్సుయాత్రను ప్రారంభించారు. యాత్రకు ముం దుగా వందలాది మంది యువకులు మోటార్ బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు సమైక్యాంధ్రకు, జగన్, విజయమ్మలకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీలకతీతంగా సమైక్యవాదులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
తొలుత అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, బస్సుయాత్ర విజ యవంతం కావాలని పూజలు చేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ మంత్రి విశ్వరూప్ పదవిని కాపాడుకునేందుకు చిత్త శుద్ధిలేని రాజీనామా చేశారని విమర్శించా రు. గొంది, సఖినేటిపల్లి, టేకిశెట్టిపాలెం, మలికిపురం, రాజోలు, తాటిపాక సెంటరు మీదుగా మామిడికుదురు వరకు యాత్ర సాగింది. మలికిపురం సెంటర్‌లో వంటావార్పు నిర్వహించి, రోడ్డుపైనే భోజనాలు చేశారు. అంతర్వేది ఆలయంలో పూజలు, టేకిశెట్టిపాలెం చర్చిలోను, మామిడికుదురు సున్ని జామియా మసీదు, షియా జామియా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. రాజోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. మామిడికుదురు సెంటరులో ధర్నా చేశారు.
బస్సు యాత్ర ప్రారంభం
Published Sat, Aug 17 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement