
సాక్షి, అమరావతి: ‘స్వాతంత్య్రానంతరం ఇందిరమ్మ, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇళ్ల పట్టాల కోసం సెంటు భూమి సేకరించలేదు. పార్టీలకతీతంగా ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించాలన్న తపనతో సీఎం జగన్ 30.76 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ద్వారా రూ.4 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నారు. పేదల గుండెల్లో నిలిచిపోతారు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన సమాధానమిస్తూ మాట్లాడారు. తొలి దశలో రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా, 3 లక్షల ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గృహ నిర్మాణంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.
40 పార్టీలు కలిసొచ్చినా భయం లేదు
నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు కలిసొచ్చి పోటీ చేసినా.. 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉంటారు. 80 శాతం మంది ప్రజలు, దేవుడి ఆశీర్వాదం మా నాయకుడికే ఉంది. ఆయన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికీ లేదు. తెలంగాణాలో 5.72 లక్షల ఇళ్లు, తమిళనాడులో 5 లక్షల ఇళ్లు, కేరళలో 5.19 లక్షల ఇళ్లు, కర్ణాటకలో లక్ష ఇళ్లు నిర్మిస్తే ఏపీలో ఏకంగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. మా చిన్నప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే నేటికీ చెప్పుకుంటున్నాం. ఇకపై మరో వెయ్యేళ్లు వైఎస్ జగన్ గురించి చెబుతారు. నేడు జగనన్న ఇంటిని చూపించి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు.
– బియ్యపు మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment