Department of Housing construction
-
జోరుగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. కొద్ది రోజులుగా వర్షాలకు తెరపివ్వడంతో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. నిర్మాణం మధ్యలో ఆపేసిన వారు తిరిగి పనులు మొదలు పెట్టారు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఆ స్థలాల్లో వారికి రెండు దశల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇళ్లు కట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో సరికొత్తగా కాలనీలు, ఊర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఆయా లేఅవుట్లలో గృహాలను నిర్మించుకునేందుకు అవసరమైన మెటీరియల్‌ను అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. చాలా కాలనీలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. మరికొన్ని కాలనీల్లో ఈ పని ముమ్మరమైంది. అంతర్గత రోడ్లు నిర్మించి, నీటి వసతికి ఇబ్బంది లేకుండా బోర్లు వేశారు. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా గృహాలను నిర్మించుకోవడంలో బిజీ అయ్యారు. గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను అప్లోడ్ చేసిన కొద్ది రోజులకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరుగుతోంది. ఆయా లే అవుట్లలో లబ్ధిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచింది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.1.80 లక్షలకు తోడు లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది. నిర్మాణాల్లో వేగం పెరగడానికి ఇది బాగా దోహదం చేస్తోంది. అందుబాటులో మెటీరియల్ గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్‌ను ఎప్పటికప్పుడు అవసరాల నిమిత్తం లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాల్లో అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆయా ప్రాంతాల్లోని గోడౌన్లకు స్టీల్, సిమెంట్‌ను ఇప్పటికే చేరవేశారు. అన్ని జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఉచితంగానే చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. వీధుల్లో స్తంభాలు, వైర్లు, ఇళ్లకు విద్యుత్ బోర్డులు, వైర్లు, మీటరు ఉచితంగా ఇస్తున్నారు. ఒక్కో కనెక్షన్‌కు దాదాపు రూ.6 వేల వరకు వ్యయం అవుతుండగా మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి కూడా ఉచితంగానే విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నారు. దీంతో వేలాదిగా కొత్త ఊర్లు, కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. నిర్మాణాల్లో మరింత వేగం పెరగాలి నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గృహ నిర్మాణం, టిడ్కో ఇళ్ల ప్రగతిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ఇప్పటి దాకా చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 యూనిట్లను లబ్ధిదారులకు అప్పగించామని చెప్పారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాలని, వచ్చే మార్చి నాటికి మరో 1,10,968 ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గినందున నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుదీకరణ పనులు సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు సీఎంకు వివరిచారు. టిడ్కో ఇళ్లు ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చే 30 లక్షల ఇళ్ల ప్రగతి గురించి కూడా వారు సీఎంకు వివరించారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు.. పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు ఆయా ప్రాంతాల నివాసితులతో సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన కల్పించడంతో పాటు, మార్గదర్శకాలు సూచించాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికివాడలుగా మారే ప్రమాదం ఉంటుందని సీఎం హెచ్చరించారు. ఆయా నివాసాలను ఏ రకంగా నిర్వహించుకోవాలన్న దానిపై అసోసియేషన్లకు అధికారులు బాసటగా నిలవాలని సూచించారు. ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడం, శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ నెల 22న పంపిణీ చేసిన టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాల తీరుపై అధికారులు సీఎంకు ప్రత్యేకంగా వివరించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీశ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల నిర్మాణాల్లో జోరు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,59,856 మంది ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు రూ.1,332 కోట్ల మేర పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్రంలో తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు వ్యయం చేస్తోంది. అయితే లబ్ధిదారుల వెసులు బాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 45 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 38, తిరుపతి జిల్లాలో 35, కాకినాడ జిల్లాలో 33, పల్నాడు జిల్లాలో 28 శాతం మేర లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయడంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రుణాల మంజూరులో వెనుకబడిన పార్వతిపురం మన్యం, నంద్యాల, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో బ్యాంకులతో సమన్వయం చేసుకుని, త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సూచించామన్నారు. దీంతో ఈ వేసవిలో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయని చెప్పారు. ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు పావలా వడ్డీయే పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. -
1.79 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. -
పేదల గుండెల్లో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘స్వాతంత్య్రానంతరం ఇందిరమ్మ, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇళ్ల పట్టాల కోసం సెంటు భూమి సేకరించలేదు. పార్టీలకతీతంగా ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించాలన్న తపనతో సీఎం జగన్ 30.76 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ద్వారా రూ.4 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నారు. పేదల గుండెల్లో నిలిచిపోతారు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన సమాధానమిస్తూ మాట్లాడారు. తొలి దశలో రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా, 3 లక్షల ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గృహ నిర్మాణంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. 40 పార్టీలు కలిసొచ్చినా భయం లేదు నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు కలిసొచ్చి పోటీ చేసినా.. 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారు. 80 శాతం మంది ప్రజలు, దేవుడి ఆశీర్వాదం మా నాయకుడికే ఉంది. ఆయన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికీ లేదు. తెలంగాణాలో 5.72 లక్షల ఇళ్లు, తమిళనాడులో 5 లక్షల ఇళ్లు, కేరళలో 5.19 లక్షల ఇళ్లు, కర్ణాటకలో లక్ష ఇళ్లు నిర్మిస్తే ఏపీలో ఏకంగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. మా చిన్నప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే నేటికీ చెప్పుకుంటున్నాం. ఇకపై మరో వెయ్యేళ్లు వైఎస్ జగన్ గురించి చెబుతారు. నేడు జగనన్న ఇంటిని చూపించి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. – బియ్యపు మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
వచ్చే ఏడాది జూన్‌కి ఇళ్లు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జూన్ నాటికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం తొలిదశ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఏపీ గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఇళ్లు లేని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతలో రాజీపడకుండా ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండరాదన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాలనీల్లో ప్రజలకు ఆరోగ్యకర జీవన పరిస్థితుల కల్పనపై ప్రభుత్వానికి ప్రత్యేకశ్రద్ధ ఉందని చెప్పారు. ప్రత్యేకాధికారులు తరచు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనుల తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని సూచించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌పాండే, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
చురుగ్గా పనులు.. బిల్లుల చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బిల్లుల చెల్లింపును గృహనిర్మాణ శాఖ వేగంగా చేపడుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 22వ తేదీ నాటికి రూ.1,500 కోట్ల విలువైన పనులు పూర్తిచేసి, బిల్లులు చెల్లించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో ప్రభుత్వం 15,60,227 ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో 11,65,006 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 16,784 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గృహ నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు ప్రతి రెండు జిల్లాలకు ఓ ప్రత్యేక అధికారిని నియమించడమేగాక రోజూ జిల్లాల అధికారులతో సమీక్షిస్తున్నారు. పనులు ఊపందుకోవడంతో ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.770 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించిన సొమ్ము రూ.2,718.67 కోట్లకు చేరింది. మరోవైపు గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు రోజుకు దాదాపు 57 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు సరిగా అందజేయకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు నిలిచిపోయిన ఘటనలపైనా దృష్టి సారించారు. పనులు పుంజుకున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల పనులు పుంజుకున్నాయి. రోజుకు సగటున 300 నుంచి 400 ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెంచుతాం. బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా నిర్మాణాలు నిలిచిపోవడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు బిల్లులు అప్లోడ్ చేయమని క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. – నారాయణభరత్ గుప్తా, ఎండీ, గృహనిర్మాణ సంస్థ -
Andhra Pradesh: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.65 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 10.87 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది కోర్టు కేసుల కారణంగా కొద్దినెలలపాటు వీటి పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఆ అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు తిరిగి గాడినపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.30 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఇళ్ల శంకుస్థాపనకు చర్యలు తొలిదశలో శంకుస్థాపనలు కాని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికీ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లేఅవుట్లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంలో రూ.62.81 కోట్లు అప్రోచ్ రోడ్లు, లేఅవుట్లలోని ఎలక్ట్రికల్ లైన్లు మార్చడానికి రూ.6.60 కోట్లు, లేఅవుట్లలో లెవలింగ్ కోసం రూ.132 కోట్లు, గోడౌన్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, ఇతర పనుల కోసం రూ.23.94 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులను జిల్లాలకు విడుదల చేశారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. వీరు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జేసీలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తొలి నుంచి చిత్తూరు జిల్లా ఇంటి నిర్మాణాల్లో ముందంజలో ఉంది. ఇటీవల రూ.228 కోట్లతో లేఅవుట్లలో వసతుల కల్పనకు అనుమతులిచ్చాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జర్మనీ సంస్థ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు అభినందించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. 152 మిలియన్ యూరోల సాయం కేఎఫ్‌డబ్ల్యూ ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగం అధిపతి మార్టిన్ లక్స్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకంలో నిర్మించే ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ తయారీ, అధ్యయనం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధ్యయనం అనంతరం ఇంధన సామర్థ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ కోసం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. -
జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, విద్యుదీకరణ, తాగు నీరు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598 విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. -
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ఆదరణ పెరుగుతోంది. పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.14 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.03 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 వేల మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 8.11 లక్షల మందిలో 6 లక్షల మంది గడిచిన 10 రోజుల్లో ముందుకు రావడం విశేషం. రూ.10వేల కోట్ల రుణాల మాఫీ ఇక గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో భారీ ఊరట కల్పించింది. ఓటీఎస్ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. రేపటి నుంచి పంపిణీ స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. గతంలో చెల్లించిన వారికి కూడా.. 2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు. అవగాహన కల్పిస్తున్నాం పథకంతో కలిగే ప్రయోజనాలపై అర్హులకు అవగాహన కల్పిస్తున్నాం. అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 22ఏ జాబితా నుంచి స్థలాలను తొలగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఇళ్లను తనఖా పెట్టుకోవడానికి, అమ్మడానికి, వారసుల పేర్లపై బదిలీ చేయడానికి వీలుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలును వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఐదుసార్లు సిఫార్సు చేసినా ఓటీఎస్ కింద వడ్డీలు మాఫీ చేయడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం వడ్డీ, అసలు రెండింటిలో రాయితీ ఇవ్వడంతో పాటు, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అర్హులు దీన్ని గమనించాలి. అర్హులైన ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకుని పథకాన్ని వినియోగించుకోవాలి. – దావులూరి దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ -
వేగంగా బిల్లుల చెల్లింపులు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం వేగవంతం చేసింది. గడిచిన వారం రోజుల్లో రూ.822 కోట్ల మొత్తాన్ని ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించింది. కోర్టు కేసుల కారణంగా గత అక్టోబర్ నుంచి ఇళ్ల నిర్మాణాలు, బిల్లు చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కోర్టు కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా అక్టోబర్ వరకూ దరఖాస్తులు చేసుకున్న బిల్లులను గృహ నిర్మాణ శాఖ చెల్లిస్తోంది. రూ.1,006 కోట్ల మేర లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వారం రోజుల్లోనే రూ. 822 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలిన రూ. 184 కోట్లకు సంబంధించిన చెల్లింపులు పరిశీలన దశలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా మంజూరు చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు రూ.1,779.70 కోట్లు చెల్లించినట్లయింది. 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం నవరత్నాలు–పేదలందిరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం తొలిదశలో 15,60,227 ఇళ్లు నిర్మిస్తోంది. వీటిలో 9,92,839 ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. 9,85,566 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 7,273 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 81శాతం బిల్లులు చెల్లింపు పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో 81 శాతం వారం రోజుల్లోనే చెల్లించాం. మిగిలిన బిల్లులకు చెల్లింపులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇనుము, ఇతర వనరులను సకాలంలో సమకూరుస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణ భరత్ గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
ఓటీఎస్ ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు మాఫీ
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల మేరకు పేదల రుణాలను మాఫీ చేస్తోందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బుధవారం విజయవాడలో సంస్థ ఎండీ భరత్ గుప్తతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1983 నుంచి 2011 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వారి అసలు, వడ్డీ కలిపి రూ.14 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఓటీఎస్ రూపంలో పేదలకు వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి నిర్ణీత మొత్తాలు చెల్లించిన వారికి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పిస్తోందని వివరించారు. 22–ఏ లిస్ట్‌లో ఉన్న స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించి, ఎలాంటి యూజర్, స్టాంప్ చార్జీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో విలువపై 7.5% చెల్లించాలని, రిజిస్ట్టర్ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు 7.5% చార్జీలు లేకుండా, ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందన్నారు. డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలను 22–ఏ లిస్టులో నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల స్థలం, ఇంటి విలువపై 75% వరకు బ్యాంక్ రుణం పొందే సదుపాయం ఉంటుందన్నారు. బ్యాంక్‌లతో సంప్రదించి రుణాలు పొందడానికి వీలుగా రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేశామని (వెట్టింగ్) చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు తీసుకోని వారు 12 లక్షల మంది ఉన్నారని, వీరు కేవలం రూ.10 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 8 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, 21న సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. తొలి విడతలో వాస్తవ హక్కుదారులు, వారి వారసుల ఆధీనంలో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. రెండో విడతలో చేతులు మారిన ఇళ్లపై విచారణలు జరిపి, ఉత్తర్వులు అందాక రిజిస్ట్రేషన్లు చేస్తామని వివరించారు. స్వచ్ఛందంగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అర్హులపై ఒత్తిళ్లు ఉండవన్నారు. ఎవరైనా హక్కులు పొందడానికి ముందుకు రాకపోతే ఎటువంటి బలవంతం చేయడంలేదని తెలిపారు. ఓటీఎస్‌కు ముందుకు రాని వారి పింఛన్లు నిలిపివేయాలని శ్రీకాకుళం జిల్లాలో సర్క్యులర్ జారీ చేసిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్ వినియోగించుకోకపోతే ఇతర పథకాలు ఆగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పథకం ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలని, ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లు, జేసీలను ఆదేశించామన్నారు. అనేక వినతులు అందాయి చివరిసారిగా రాష్ట్రంలో 2014లో ఓటీఎస్ అమలు జరిగిందని అజయ్ జైన్ చెప్పారు. అనంతరం ప్రజాప్రతినిధులు, రుణ గ్రహీతల నుంచి ఓటీఎస్ అమలు చేయాలని అనేక వినతులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2016లో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ శాఖ కార్యవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందన్నారు. అయితే అప్పటి ప్రభుత్వం అమలుపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ, అసలు రెండింటికీ రాయితీ ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. -
లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 25న వీటి నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా పనులు ప్రారంభించేలా కసరత్తు మొదలైంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని రాష్ట్రవ్యాప్తంగా 3,25,899 మంది లబ్ధిదారులు ఎంచుకున్నారు. వీరందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 12,855 గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల్లో 10 నుంచి 20 మందిని ఒక్కొక్క గ్రూపుగా గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,77,421 మందితో 12,855 గ్రూపులను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ నూరు శాతం పూర్తయింది. ఈ జిల్లాలో 12,632 మంది లబ్ధిదారులు ఉండగా.. 1,087 గ్రూపులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలో 92%, కర్నూలు జిల్లాలో 78 %గ్రూపుల ఏర్పాటు పూర్తయింది. అత్యల్పంగా విజయనగరంలో 14% మాత్రమే గ్రూపుల ఏర్పాటు జరిగింది. తగ్గనున్న నిర్మాణ వ్యయం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రూపులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లను గుర్తించి అనుసంధానిస్తున్నారు. ఈ విధానం వల్ల గ్రూప్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్లన్నింటికీ ఒకే నిర్మాణ ధర వర్తిస్తుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ నెలాఖరు నాటికి స్థానికంగా కాంట్రాక్టర్ల గుర్తింపు, గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారుల గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఏర్పాటు పూర్తికి కృషి చేస్తున్నాం. వచ్చే నెల 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్ కార్పొరేషన్ -
కృష్ణా జిల్లాలో ఏడుగురు ఏఈలపై చర్యలు
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పథకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు హౌసింగ్ ఏఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. పథకం అమలుపై మండల స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం నందిగామ నియోజకవర్గం వీరులపాడు తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల నిర్మాణం కోస జిల్లాకు కేటాయించిన 750 టన్నుల ఉక్కు ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు. జగనన్న కాలనీలలో లే అవుట్లు పూర్తి అయి, ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా ఇంకా గ్రౌండింగ్ చేయని లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే నిర్మాణం చేపట్టేలా ఏఈలు చూడాలన్నారు. ఈ విషయంలో ప్రగతి సాధించని ఏఈలను సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలకు రుణం రాని కారణంగా ఇళ్ల నిర్మాణానికి కొందరు ముందుకు రావడం లేదన్న కారణం సరికాదని, వారికి ఇచ్చే రుణాలు ఇళ్ల నిర్మాణానికి అదనపు సహాయం మాత్రమేనని చెప్పారు. వీరిపై శాఖాపరమైన చర్యలు... గృహ నిర్మాణ శాఖ ఏఈలు పి.సుబ్బారావు (అవనిగడ్డ), బి.నెహ్రూ (కంకిపాడు), ఎన్.వెంకటేశ్వరరావు (నందిగామ), వెంకటేశ్వరరావు(చందర్లపాడు), సీహెచ్ ఎస్ఎస్ఆర్వీ ప్రసాద్ (విజయవాడ రూరల్), ఎన్.సాయిబాబు (వీరులపాడు), ఎ.నరసింహారావు (కంచికచర్ల) లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
ఇది పేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో అధికారుల పాత్ర కీలకమని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఈ పథకం నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం అని తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంపై మంత్రి అధ్యక్షతన విజయవాడలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం 13 జిల్లాల హౌసింగ్ జేసీలు, ప్రాజెక్టు డైరెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలాఖరుకు మొదటి దశలో నిర్మింప తలపెట్టిన ఇళ్లన్నింటికి శంకుస్థాపనలు పూర్తి కావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లే అవుట్లను సందర్శించి వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్, జగనన్న కాలనీలు అన్ని వసతులతో కళకళలాడుతూ రాష్ట్రంలో మోడల్ గ్రామాలు, కాలనీలుగా నిలవాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌సూచించిన విధంగా పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ.. మొదటి దశ శంకుస్థాపనలు జరిగిన ఇళ్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో మంత్రి, అధికారులు జిల్లాల వారీగా పథకం అమలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా సమీక్షించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాహుల్‌పాండే, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దావులూరి దొరబాబు, ఎండీ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రి: శ్రీరంగనాథరాజు
విజయవాడ: తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే సామాగ్రిని అందిస్తున్నట్లు, ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా చేయడంతో పాటు అదనంగా ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తున్నామన్నారు. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. లబ్ధిదారులకు ఆప్షన్ లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని, వారికి ఎలా కావాలంటే అలా ఇళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి మూడో కేటగిరి ఇళ్ల నిర్మాణం చేపడతున్నట్లు తెలిపారు. -
ప్రతి జగనన్న కాలనీకి నోడల్ అధికారి నియామకం
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలో జగనన్న కాలనీల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు ఉత్తర్వులతోపాటు నిధులను, మెటీరియల్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి కాలనీకి మండల స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.30 వేల విలువైన ఇసుకను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
వార్డు సచివాలయానికి మారు వేషంలో డిప్యూటీ కలెక్టర్
చిత్తూరు అర్బన్(చిత్తూరు జిల్లా): ఓ మహిళ శనివారం ఉదయం చిత్తూరులోని 36వ వార్డు సచివాలయంలో అడుగుపెట్టింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వద్దకు వెళ్లి తనకు సొంతిల్లు లేదని వాపోయింది. ఏడాది కిందట తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చానని తెలిపింది. దరఖాస్తు చేసి.. ఇల్లు మంజూరు చేయించాలని కోరింది. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ అధికారులు సచివాలయానికి రావడంతో విషయం బయటపడింది. తమ ముందు నిల్చొని ఉన్నది డిప్యూటీ కలెక్టర్, గృహ నిర్మాణ ప్రత్యేకాధికారి పల్లవి అని తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. చిత్తూరు డివిజన్ గృహ నిర్మాణ ప్రత్యేకాధికారిగా ఉన్న పల్లవి.. లక్ష్యం మేరకు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని ఇటీవల ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు సామాన్యురాలిగా శనివారం ఆమె రంగంలోకి దిగారు. 36వ వార్డు సచివాలయానికి వెళ్లి.. అక్కడ ఉన్న ఇద్దరు కార్యదర్శులతో మాట్లాడారు. డిప్యూటీ కలెక్టర్ అనే విషయం బయటపడిన తర్వాత.. సచివాలయంలోని రికార్డులను ఆమె పరిశీలించారు. ప్రజలకు సొంతిళ్లు నిర్మించడమే లక్ష్యంగా పని చేయాలని వారిని ఆదేశించారు. -
జోరుగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు శంకుస్థాపనలు పూర్తిచేశారు. అంతకుముందు ఇళ్ల శంకుస్థాపనలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ధారించిన గడువులోగా తొలిదశ నిర్మాణాలను పూర్తిచేయాలని అధికార యంత్రాంగం పట్టుదలతో కృషిచేస్తోంది. దీంతో రెండు నెలల్లో రూ.597.94 కోట్ల విలువైన పనులు జరిగాయి. మరోవైపు.. తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు స్టీలు, సిమెంట్, ఇసుక, కూలీలకు మాత్రమే ప్రస్తుతం వ్యయమవుతోంది. బేస్మెంట్ స్థాయి దాటితే రోజు వారీ వ్యయం మరింత పెరుగుతుందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో సాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు, శ్రీకాకుళం జిల్లాలో పనులను పరిశీలిస్తున్న అధికారులు కాలనీల వద్దే నిర్మాణ సామగ్రి గోదాములు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని గృహ నిర్మాణ శాఖ కాలనీలకు సమీపంలోనే అందుబాటులో ఉంచడంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుని వీటిని నిల్వ ఉంచారు. అలాగే.. ► పేదల ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను కొనుగోలు చేయడమే కాకుండా 89,379.30 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను గోదాములకు తరలించి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. ► 24,022.68 మెట్రిక్ టన్నుల స్టీలు కొనుగోలు చేసి 3,930.557 మెట్రిక్ టన్నులను గోదాముల్లో ఉంచారు. ► ఇక 1,09,774 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచారు. దీంతో జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ధారించిన గడువులో పూర్తిచేసేందుకు సీఎం జగన్ జిల్లాకో జేసీని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. వీరు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్లు పూర్తి సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్ స్థాయికి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువగల పనులు జరుగుతున్నాయి. బేస్మెంట్ స్థాయి దాటిన తరువాత రోజుకు రూ.50 కోట్ల పనులు జరుగుతాయి. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 1, 3, 4 తేదీల్లో ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమాన్ని చేపట్టి.. రికార్డు స్థాయిలో గృహాల నిర్మాణానికి భూమిపూజలు చేయించారు. రెండ్రోజుల నుంచి లబ్ధిదారులుకు బిల్లులు చెల్లించడానికి వీలుగా వారి వివరాలను గృహనిర్మాణ శాఖ వెబ్సైట్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటలకు 7,87,917 మంది లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి వాటిని లేఅవుట్లకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు ఎన్.కమలాకరబాబు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎం.శివప్రసాద్, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సీఈ శ్రీరాములును ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించిన మేరకు 2022 జూన్ నాటికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అజయ్‌జైన్ అధికారులను ఆదేశించారు. -
సంతోషానికి 'పునాది'
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం విజయవంతమయ్యింది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు లక్ష ఇళ్లకు శంకుస్థాపనలు చేయించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా, లబ్ధిదారులు కలసి రావడంతో 158 శాతం అధికంగా ఇళ్లకు శంకుస్థాపన జరిగింది. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారి. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శనివారం, ఆదివారం కూడా కొనసాగనుంది. సాక్షి, అమరావతి: సొంతింట్లో ఉండాలనేది అందరి కల. ఇది పెద్దోళ్లకు సుసాధ్యమైనా, పేదోళ్లకు మాత్రం కష్టసాధ్యం. సొంతింటి కల విషయంలో ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేయి పట్టుకుని నడిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి నిరుపేదలు పోటీపడ్డారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి పోటాపోటీగా శంకుస్థాపనలు చేయడంతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా.. 157 శాతం ఇళ్లకు శంకుస్థాపన జరగడం గమనార్హం. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శని, ఆదివారాల్లో కూడా కొనసాగనుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని లేఅవుట్ వద్ద లబ్ధిదారులు పేదోళ్లందరికీ సొంతిల్లు రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ పథకం కింద మొదటి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గతనెల 3న సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ గృహాలను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. జగన్ దృఢ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా ముందుకు కదిలింది. ఈనెల 1, 3, 4న మూడు రోజుల్లో రోజుకు లక్ష చొప్పున మూడు లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో శంకుస్థాపన చేయించాలని నిర్దేశించుకుంది. ఈ మూడు రోజులూ యజ్ఞంలా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజున 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రికార్డు స్థాయిలో శంకుస్థాపనలు లబ్ధిదారులు గురువారం ఉదయమే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన స్థలంలో.. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పండిత విల్లూరులోని వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కృష్ణా జిల్లా పెనమలూరులోని కాలనీలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు పోటాపోటీగా కదలిరావడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2,02,190 గృహాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రత్యేక జాయింట్ కలెక్టర్ ద్వారా పర్యవేక్షణ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 68,381 ఎకరాల భూమిని 30.76 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున స్థలాలను పంపిణీ చేసి గృహాలను కూడా మంజూరు చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.50,944 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, భూగర్భ మురుగునీటి కాలువల వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తొలి దశలో 8,905 కాలనీల్లో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్–హౌసింగ్ పదవి సృష్టించి, యువ ఐఏఎస్ అధికారులను నియమించింది. పనులను పరుగులు పెట్టిస్తోంది. కృష్ణాజిల్లా నున్న గ్రామంలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు యజ్ఞంలా ఇళ్ల శంకుస్థాపన మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజు లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో 2.02 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ ఒకే రోజున లబ్ధిదారులే ఇంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న దాఖలాలు లేవు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్లను జూన్‌లోగా పూర్తి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఆలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం. తొలి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జేసీలు, అధికారులు, లబ్ధిదారులకు కృతజ్ఞతలు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
సామూహిక ఇళ్ల శంకుస్థాపనలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంపై మంత్రి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 1, 3, 4వ తేదీల్లో జరిగే సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఈనెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలకు శంకుస్థాపన పూర్తికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి మొదటి దశలో 15.6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు పూర్తి చేసి, 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, చీఫ్ ఇంజనీర్ పి.శ్రీరాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీల్లో.. 3 రోజుల్లో 3 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాంగం సమష్టి చర్యలు చేపడుతోంది. మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తాలను సైతం ఖరారు చేసింది. మెగా వ్యాక్సినేషన్ స్ఫూర్తితో రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యంతో రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల పేదల ఇళ్లను గ్రౌండింగ్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జూలై 1, 3, 4 తేదీల్లో యజ్ఞంలా నిర్మాణాలను ప్రారంభించేలా సీఎం కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నియమించారు. వివిధ స్థాయిల్లో అధికారుల పర్యవేక్షణ ఈ కార్యక్రమంలో ప్రధానంగా గృహ నిర్మాణ, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం, మునిసిపల్ పట్టణాభివృద్ధి విభాగం, రవాణా, ఇంధన శాఖలు పూర్తిగా భాగస్వామ్యం కానున్నాయి. ఇందుకోసం ప్రతి మండలం, మునిసిపాలిటీలకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డుకు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ప్రతి లే–అవుట్‌కు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. వలంటీర్లను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నారు. సోమవారం మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. 29వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ స్థాయి ఉద్యోగులు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. 30వ తేదీన వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమై మెగా గ్రౌండింగ్‌కు వారిని సమాయత్తం చేస్తారు. మూడు రోజులపాటు జరిగే ఇళ్ల మెగా గ్రౌండింగ్ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతారు. లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుకను సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. లే–అవుట్లు దూరంగా ఉంటే.. సిమెంట్, ఇసుక అక్కడికి తరలించేలా లబ్ధిదారులకు వాహనాలు సమకూరుస్తారు. లే–అవుట్లలో ఇళ్ల గ్రౌండింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తీసి యాప్‌లో అప్లోడ్ చేసేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వలంటీర్లు ఫొటోలు ఏర్పాట్లు చేశారు. రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం: అజయ్ జైన్ గతంలో ఏడాదికి లక్షన్నరకు మించి ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, ఇప్పుడు పేదల కోసం రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ధేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందన్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటిని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తాన్ని భాగస్వామ్యం చేస్తూ మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందుకోసం లే–అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్ సమకూరుస్తున్నామని చెప్పారు. మెగా గ్రౌండింగ్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్దఎత్తున ఒకేసారి పేదల కోసం ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అధికార యంత్రాంగమంతా సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుందన్నారు. చదవండి: మూడు నెలల్లో వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభం -
ప్రతి లే అవుట్‌ను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం
ఒంగోలు అర్బన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు నిర్మించే ఇళ్ల తాలూకు లే అవుట్లను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి రంగనాథరాజు మీడియాతో మాట్లాడారు. ప్రతి లే అవుట్లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద లే అవుట్లు ఉన్న చోట్ల బస్టాండ్‌తో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 2, 3, 4, 5 తేదీల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించి నిర్మాణాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం: మంత్రి సురేష్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని చెప్పారు. అందువల్లే ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని, పరీక్షల రద్దును కేవలం రెండో ఆప్షన్‌గానే చూశామని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ స్పష్టం చేశామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసే నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. -
జగనన్న కాలనీల్లో ‘పవర్’ఫుల్ లైన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అత్యాధునిక హంగులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక 90 శాతం తయారైనట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై గురువారం సమీక్షిస్తారని చెప్పారు. జగనన్న కాలనీల్లో పటిష్టంగా విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు చేపట్టారు. లే అవుట్లలో ఇళ్ల సంఖ్య, వినియోగించే విద్యుత్ ఆధారంగా ముందే లోడ్‌ను అంచనా వేశారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతకు ఇందులో ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి వీధిలో రాత్రి వేళ అధిక వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలను అమరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన గాలి, వెలుతురు వినియోగించుకుంటూ తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా విదేశీ సాంకేతికతతో నిర్మాణాలు చేపట్టనున్నారు. పోల్స్ కనిపించకుండా పవర్.. జగనన్న కాలనీల్లో ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.6,475.41 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. 500 ఇళ్ల కన్నా ఎక్కువ ప్లాట్లు ఉండే లే అవుట్లలో పూర్తిగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల కాలనీల్లో వీధి దీపాలకు మినహా పెద్దగా విద్యుత్ పోల్స్ అవసరం ఉండదు. భూగర్భ విద్యుత్ వ్యవస్థ వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు తెలిపారు. తక్కువ ఇళ్లు ఉండే లే అవుట్లలో మాత్రం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో 2,271 లేఅవుట్లకు నెలాఖరుకు డీపీఆర్ కోర్టు వివాదాల్లో ఉన్నవి, వ్యక్తిగతంగా ఇంటి స్థలం ఉన్నవారిని మినహాయిస్తే ఇప్పటివరకూ 17,005 లే అవుట్లకు సంబంధించి 18,77,263 ఇళ్ల విద్యుదీకరణపై అధికారులు దృష్టి పెట్టారు. 17,92,225 ఇళ్లకు సంబంధించి 14,734 లేఅవుట్ల పరిధిలో విద్యుదీకరణకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) రూపొందించారు. ఇందులో భూగర్భ విద్యుత్ సరఫరా చేసే లే అవుట్లు 432, ఇళ్లు 8,36,705 ఉన్నాయి. మరో 2,271 లేఅవుట్లకు సంబంధించి 85,038 ఇళ్లకు విద్యుదీకరణ డీపీఆర్ ఈ నెలాఖరుకు సిద్ధం కానున్నట్లు అధికారులు తెలిపారు. 50 శాతం భూగర్భ విద్యుత్తే జగనన్న కాలనీల్లో 50 శాతం వరకూ భూగర్భ విద్యుదీకరణకే ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం డీపీఆర్‌లు పూర్తయ్యాయి. మిగతా డీపీఆర్‌లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రెండు దశల విద్యుదీకరణ ప్రక్రియను 2023కి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుదీకరణకు అయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకుని డిస్కమ్‌లకే అందిస్తాం. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. – అజయ్‌జైన్ (గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) -
Andhra Pradesh: లక్షల్లో ఇళ్లు.. వేలల్లో ఊళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో శరవేగంగా అడుగులు వేస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా నేడు మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అన్ని వసతులతో ఇళ్లు మాత్రమే కాకుండా.. తాగునీరు, విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, ఇంటర్నెట్ వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో సర్వ హంగులతో అందమైన 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలను (తొలి దశలో 8,905, రెండో దశలో 8,100) నిర్మిస్తోంది. ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తున్న దాఖలాలు లేవని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న లే అవుట్ 2023 జూన్ నాటికి పూర్తి ► ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ’నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే హామీని 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించింది. ► ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల గృహాలు, రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► మొదటి దశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నిర్మించనున్నారు. అలాగే 2,92,984 ఇళ్లను సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు, 1,40,465 ఇళ్లను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇప్పుడు వైఎస్సార్ జగనన్న కాలనీల్లోని ఇళ్లతోపాటూ ఈ గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. 28.30 లక్షల ఇళ్లు కాదు.. 17,005 ఊళ్లు.. ► రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్లు కొత్తగా 17,005 ఊళ్లను సృష్టిస్తాయన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు నిజమవుతున్నాయి. అవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. అనే దృష్టితో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ► దాంతో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తొలి దశలో 8905 వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మిస్తుండగా.. రెండో దశలో 8,100 కాలనీలను నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ► రూ.4,128 కోట్లతో తాగునీరు, రూ.22,587 కోట్లతో సిమెంట్ రోడ్లు, కాలనీ సైజును బట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్.. రూ.4,986 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం, రూ.627 కోట్లతో ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు వ్యయం చేస్తోంది. అందమైన కాలనీలు.. అన్ని వసతులు ► వైఎస్సార్ జగనన్న కాలనీలను అన్ని హంగులతో.. అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా కాలనీలు రూపు దిద్దుకోబోతున్నాయి. ► ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకును అందిస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మ్యాపింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయింది. జియో ట్యాగింగ్ పనులు చివరి దశలో వున్నాయి. ► 8,798 లేఅవుట్లలో గృహ నిర్మాణానికి అవసరమైన నీటి పథకాలను చేపట్టగా, వాటిల్లో 2,284 లేఅవుట్లలో పనులు పూర్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం ► కోవిడ్–19 రెండో దశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో.. పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహ నిర్మాణం ఊతం ఇవ్వబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కూలీలకు 21.70 కోట్ల పని దినాలు లభించబోతున్నాయి. ► పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న ఇళ్ల నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీíÙయన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్ విక్రేతలకు ఉపాధి లభించనుంది. సరసమైన ధరలకే నాణ్యమైన నిర్మాణ సామగ్రి ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల (మెటిరీయల్) ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పేదలపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ► లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా అందించనుంది. లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు ► గృహ నిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. ఆప్షన్ 1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆప్షన్ 2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా పని పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులను జమ చేస్తుంది. ఆప్షన్ 3 : తాము కట్టుకోలేమని చెప్పిన వారికి, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నిర్దేశించిన నమూన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంతోపాటు పూర్తి సహయ సహకారాలు అందించి ప్రభుత్వమే కట్టిస్తుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం కోసం 69.70 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 7.44 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 232.50 కోట్ల సిమెంట్/ఫాల్ జి బ్లాక్స్(ఇటుకలు)ను ప్రభుత్వం సేకరిస్తోంది. తద్వారా కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల వల్ల లక్షలాది మంది తాపీ మేస్ట్రీలు, రాడ్ వెండర్లు, కార్పెంటర్లు, ఎల్రక్టీషియన్లు, ప్లంబర్లు, కూలీలకు ప్రత్యక్షంగా చేతినిండా పని దొరుకుతుంది. సామగ్రి రవాణా, హోటళ్లు, ఇతరత్రా పరోక్షంగా మరికొన్ని లక్షల మందికి ఉపాధి కలగనుంది.