
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment