ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్‌ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్‌లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు.
అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్‌లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు.
ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Comments
Please login to add a commentAdd a comment