విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి అనుప చక్రవర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు అతిథులుగా జిల్లా జడ్జితోపాటు లోకాదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్, రిటైర్డ్ డీఎస్పీ పాపారావు పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం హక్కులతోపాటు విధులను కూడా ప్రజలకు ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకుని మనము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామని ఆలోచించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. తన చదువు మొత్తం ప్రభుత్వ బడులు, కళాశాలల్లోనే ముగిసిందని జడ్జి అనుపచక్రవర్తి చెప్పారు. అనంతరం విద్యార్థులకు చట్టాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీవీ రాజేశ్వరి, వైస్‌ప్రిన్సిపాల్ వీరాచారి, అధ్యాపకులు ఇంద్రాశాంతి, శ్రీదేవి, వసుంధరమ్మ, నజీర్ అహ్మద్, ఇమ్మానుయేల్, ఫరిదా, సమిదా, అనిత పాల్గొన్నారు.