విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– లోక్ అదాలత్ జడ్జి
కర్నూలు: చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సంతోష్‌నగర్‌లోని ఉమామాధవ ఇంగ్లిషు మీడియం స్కూలులో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సోమశేఖర్ హాజరయ్యారు. ప్రాథమిక హక్కులు, వాటి బాధ్యతల గురించి సోమశేఖర్ విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆదినారాయణ రెడ్డి, నాగముని, వరలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ మాధవకృష్ణ తదితరులు పాల్గొన్నారు.