చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి | explain about law | Sakshi
Sakshi News home page

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

Published Sun, Aug 7 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కర్నూలు(లీగల్‌): 
న్యాయవాదులు చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో జిల్లాలోని ప్యానల్‌ అడ్వకేట్స్‌కు రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణా న్యాయవాదుల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవ చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఏలూరుకు చెందిన న్యాయవాది టి.సుబ్బారావు, విశాఖకు చెందిన ఆర్‌.శ్రీనివాసరావు, ఆళ్లగడ్డ సబ్‌ జడ్జి సి.ఎన్‌.మూర్తి, కర్నూలు ఐఎఫ్‌సీఎం మెజిస్ట్రేట్‌ కె.పద్మినిలు పాల్గొని వివిధ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ప్రేమావతి, రఘురాం, సుధాకర్, సబ్‌ జడ్జిలు శివకుమార్, లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, పి.రాజు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.ఓంకార్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు వంద మంది ప్యానల్‌ అడ్వకేట్స్‌ శిక్షణలో పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement