awarness
-
ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్
అమెరికాలో డాక్టర్ చదవాలనుకునే విద్యార్ధులకు అత్యంత కీలకమైన ఎంక్యాట్పై నాట్స్ అవగాహన కల్పించింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సు మెడికల్ చదవాలనుకునే విద్యార్ధులకు దిశా నిర్థేశం చేసింది. ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి శ్రీచరణ్ మంచికలపూడి తన విజయానికి బాటలు వేసిన మార్గాలను వివరించారు. ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి..? ఏయే అంశాల మీద పట్టు సాధించాలి..? అందుకు అవలంబించాల్సిన మార్గాలేమిటి.? ఏ అంశాలను ఎలా నేర్చుకోవాలి.? ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కుల కోసం ఎలా కృషి చేయాలి.? ఇలాంటి ఎన్నో అంశాలను శ్రీచరణ్ మంచికలపూడి చక్కగా వివరించారు. ముందుగా ఈ సదస్సులో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి వివరించారు. ఈ సదస్సుకు సంకీర్త్ కటకం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆన్లైన్ ద్వారా విద్యార్ధులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీచరణ్ మంచికలపూడికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు. (చదవండి: అట్లాంటా భారత రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం) -
కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
ఆదిలాబాద్: కోవిడ్.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్–1 వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. వైరస్ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ కలవరం.. ప్రస్తుతం జేఎన్–1 వేరియంట్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది. శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం! ప్రమాదకరమైన కొత్త వేరియంట్ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్ డ్రిల్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు. జిల్లాలో కోవిడ్ టెస్టుల వివరాలు : 7,40,181 పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707 జిల్లాలో సంభవించిన మరణాలు : 92 ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు : 5,52,815 సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు : 5,55,884 ప్రికాషన్ డోస్ తీసుకున్న వారు : 2,65,780 ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి కొత్త వేరియంట్ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో -
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి
మనోజ్ బాజ్‌పాయ్ నటించిన తాజా హిందీ చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వంలో జీ స్టూడియోస్, వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, ఆసిఫ్ షేక్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో, ప్రస్తుతం థియేటర్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జూన్ 7 నుంచి వీక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన లాయర్ సోలంకి పాత్ర సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అందుకే బాగా కనెక్ట్ అవుతున్నారు. కథపరంగా విలన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఓ పదహారేళ్ల అమ్మాయి అనుభవిస్తున్న బాధ, ఆమె తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సోలంకిల కోణంలోనే చూపించే ప్రయత్నం చేశాం. న్యాయవ్యవస్థకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాం. ఫోక్సో చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్లీ తెలుగులో సినిమా చేస్తాను’’ అన్నారు. -
దేశమంతా పాదయాత్ర
కోచి: కేరళలోని కొట్టాయానికి చెందిన బెన్నీ కొట్టార్తిల్ (53), ఆయన భార్య మోలీ బెన్నీ (46) దేశమంతటినీ కాలినడకన చుట్టొచ్చారు. ఈ ఘనత సాధించిన తొలి జంటగా నిలిచారు. 2021 డిసెంబర్ 1న కన్యాకుమారిలో మొదలు పెట్టి జూలై 3న ముగించారు. మొత్తం 17 రాష్ట్రాలను కవర్ చేశారు. ప్రజల్లో నడకపై అవగాహనను మరింత పెంచేందుకే పాదయాత్ర చేసినట్టు చెబుతున్నారు. ‘‘యాత్ర పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. బిహార్‌లో ఓ రాత్రి ఎక్కడా ఆశ్రయం దొరక్క శ్మశానంలో తలదాచుకున్నాం! పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం అన్నింటికంటే ఎక్కువగా నచ్చింది. ఆంధ్రా స్టైల్ భోజనానికి ఏదీ సాటి రాదు’’ అన్నారు. యాత్రానుభవాలను సొంత యూట్యూబ్ చానళ్లో పంచుకున్నారు. స్పాన్సర్లు దొరికితే మళ్లీ పాదయాత్రకు సిద్ధమంటున్నారు! -
'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్‌కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట #WearHelmet #SafetyFirst Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022 -
చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..
న్యూఢిల్లీ: ఖజురహో నృత్యోత్సవాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతాయని మీకు తెలుసా? పోనీ .. ఆసియా సింహాలకు ఏకైక ఆవాసం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యమనే సంగతి తెలుసా? కొంత మందికి తెలిసి ఉండొచ్చేమో గానీ.. చాలా మంది భారతీయులకు మన దేశం, చరిత్ర, సంస్కృతి, ఆహార విహారాలు మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే ఉండటం లేదు. మహీంద్రా హాలిడేస్ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘తమ దేశం గురించి, దేశ భిన్నత్వం, విస్తృతి, సంస్కృతి, వారసత్వం, వంటకాలు మొదలైన వాటి గురించి మన వారిలో అవగాహన లేమి .. ఆశ్చర్యపర్చేలా ఉంది’’ అని సర్వే పేర్కొంది. ఇందులో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మన దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, పర్యటన స్థలాలు, వాతావరణం, ఆహారం మొదలైన వాటి గురించి తమకు అంతగా తెలియదని వెల్లడించారు. ‘‘భారతదేశ వైవిధ్యంపై అవగాహన, పరిజ్ఞానం గురించి నిర్వహించిన ఈ సర్వే ప్రకారం చాలా మందికి మన వంటకాల గురించి అతి తక్కువగా తెలుసు. నిజానికి భారతదేశానికి కాఫీని పరిచయం చేసినప్పుడు మొట్టమొదటి సారిగా కూర్గ్‌లో పండించిన సంగతి తెలిసిన వారి సంఖ్య మూడో వంతు కన్నా (31 శాతం) తక్కువే’’ అని సర్వే పేర్కొంది. దేశీయంగా వివిధ ప్రాంతాలను సందర్శించే కొద్దీ వివిధ రాష్ట్రాలకు సంబంధించి తమకు తెలియని సంస్కృతులు, వంటకాలు మొదలైన వాటి గురించి ఆసక్తి పెరుగుతుందని, తద్వారా భారతదేశ వైవిధ్యం గురించి అవగాహన పెంచుకోవచ్చని మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా ఎండీ కవీందర్ సింగ్ తెలిపారు. సర్వేలో మరిన్ని వివరాలు.. ► భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వంపై కూడా ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమేనని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు ఖజురహో ఉత్సవాలను మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తారన్న సంగతి మూడో వంతు మందికి (39 శాతం) పైగా తెలియదు. ఇక మహారాష్ట్ర .. పైఠనీ చీరలకు పెట్టింది పేరని సుమారు మూడో వంతు మంది (32 శాతం)కి తెలియదు. ► భారతదేశ భౌగోళికాంశాలపై కూడా ప్రజల్లో పరిజ్ఞానం ఒక మోస్తరుగానే ఉంది. భారతదేశంలోని గిర్ అభయారణ్యంలో మాత్రమే ఆసియా సింహాలు కనిపిస్తాయన్న విషయం మూడొంతుల మందికి (దాదాపు 39 శాతం) తెలియదు. అలాగే, ఉదయ్‌పూర్‌ను సరస్సుల నగరంగా వ్యవహరిస్తారని, చైనా వాల్ తర్వాత అత్యంత పొడవైన గోడ గల కుంభల్గఢ్ కోట .. రాజస్థాన్‌లో ఉందన్న సంగతి గానీ సుమారు మూడోవంతు మందికి తెలియదు. ► టెలిఫోన్, ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా మహీంద్రా హాలిడేస్ ఈ సర్వే నివేదిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, చండీగఢ్ తదితర 16 నగరాల నుంచి 4,039 మంది ఇందులో పాల్గొన్నారు. -
అనంతమైన వింతలపుంత విశ్వాంతరాళం
విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి ‘నాసా’ అంగారక యాత్రా బృందం సభ్యురాలు జస్లి¯ŒS భానుగుడి(కాకినాడ): విశ్వంలో అంతులేనన్ని అద్భుతాలున్నాయని అమెరికాలోని అంతరిక్ష సంస్థ ‘నాసా’ 2020లో చేపట్టే అంగారకయాత్ర బృందం సభ్యులు జస్లి¯ŒS జోష¯ŒS అన్నారు. అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల వంటి వాటిపై విద్యార్థి దశ నుంచే అవగాహన, ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంగారకయాత్రకు ‘నాసా’ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో 6,100 మంది పాల్గొనగా ఎంపికైన 8 మందిలో హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన జస్లి¯ŒS ఒకరు. ఇంజినీరింగ్ పట్టభద్రురాలైన ఆమె ప్రస్తుతం యాత్ర నిమిత్తం ‘నాసా’ శిక్షణ పొందుతున్నారు. అంగారక గ్రహంపై శుక్రవారం ఆశ్రమ్ పబ్లిక్‌స్కూల్ విద్యార్థులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ తాను రోదసీ యాత్రికురాలు కల్పనా చావ్లా స్ఫూర్తితో ఈ స్థాయికి చేరానన్నారు. తాను ఏవిధంగా నాసాకు ఎంపికయినదీ వివరించారు. విద్యార్థి దశలోనే ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుని, లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. అంగారక గ్రహం, అంతరిక్షంపై విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సై¯Œ్స పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు దేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు జస్లి¯ŒS తెలిపారు. కల్పనా చావ్లా లాంటి వారిని దేశానికి అందివ్వడమే తన లక్ష్యమన్నారు. అంతరిక్ష యాత్ర చేయాలన్న చిన్ననాటి కోరిక త్వరలో నెరవేరబోతున్నందున ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ రీజినల్ కో ఆర్డినేటర్, అంతరిక్ష పరిశోధనా విద్యార్థి దీపికా దవులూరి మాట్లాడుతూ త్వరలో రోదసీలోకి అడుగుపెట్టబోతున్న వ్యక్తిని కాకినాడ నగరానికి పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. టెక్మంత్రా ల్యాబ్స్ నవ్‌దీప్ విష్ణువాన్సీ, ఆశ్రమ్ పాఠశాల కరస్పాండెంట్ డీవీ కృష్ణంరాజు, డైరెక్టర్ రామచంద్రరావు, ప్రిన్సిపాల్ అగస్టీ, అడ్మినిస్ట్రేష¯ŒS ప్రతినిధి ఎలిజా, దవులూరి రాంబాబు, జేడీ పవ¯ŒS పాల్గొన్నారు. -
కాలుష్య నియంత్రణకు సహకరించాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సమాజంలోని ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణకు సహకరించాలని కళాజాతా బృందాల కోఆర్డినేటర్ వై.మురళీకృష్ణ పిలుపునిచ్చారు. డిసెంబర్ 2వ తేదీన నిర్వహించనున్న కాలుష్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ అవెర్నెస్ ఫోకాట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణపై కళాజాతా బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కర్నూలు పట్టణంలోని చెన్నమ్మ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో కళాజాతా బృందం పాటలు, కథలు ద్వారా కాలుష్య నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదని, మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు వై.రమణ, ఎం.విజయకుమార్ పాల్గొన్నారు. -
‘దోమలపై దండయాత్ర’
-
ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలు
– రూ.2 వేల కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి – పుష్కర నిర్వహణలో మనమే ఫస్ట్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్):రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు వై. ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి కేఈ, ప్రజా ప్రతినిధులు, అధికారులు డా.బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఎస్సీలకు రూ.8 వేల కోట్లు, ఎస్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ పరీక్షలకు సంసిద్దం అయ్యేందుకు శిక్షణను ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ పరంగా కూడా ఎస్సీ వర్గాలను అభివద్ధి చేసేందుకు పలు రకాల యాంత్రిక పరికరాలపై సబ్సిడీని అందిస్తున్నామన్నారు. – ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజనులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. – శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దొరవారి భూములు దాదాపు 1600 ఎకరాలు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. – ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. – జేసీ హరికిరణ్ మాట్లాడుతు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు వచ్చిన 900 ఫిర్యాదుల్లో 600 ఫిర్యాదులను పరిష్కరించామని, మిగిలినవి పరిష్కార దిశగా ఉన్నాయన్నారు. – కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, తెలుగుమహిళ నాయకురాలు అంకం విజయ, దళిత సంఘాలకు చెందిన నాయకులు బాలసుందరం, త్యాగరాజు, అశోకరత్నం, అనంతరత్నం మాదిగ, రాజ్‌కుమార్, కే వెంకటేష్, గడ్డం నాగముని, వేల్పుల జ్యోతి, డీవీఎంసీ సభ్యులు చిటికెల సలోమి, చిన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
ఆన్‌లైన్‌కు తొందరెందుకు...?
ఈ– విధానం సరికాదు వెబ్‌ల్యాండ్ విధానంపై మండిపడిన రైతులు భూములపై హక్కు పత్రం మా వద్దే్ద ఉంచండి సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారమేదీ ‘సాక్షి’ అవగాహన సదుస్సులో గళం విప్పిన కర్షకులు భూములపై రైతులకున్న హక్కులను హరించేలా ఉన్న వెబ్ ల్యాండ్‌లో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయి...వాటిన్నంటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించిన అనంతరమే భూములను ఆన్లైన్ చేయాలి ... లేకుంటే తాము కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని రైతులు గళం విప్పారు. వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమలాపురం గోశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకు పెద్దఎత్తున రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు హాజరై వెబ్‌ల్యాండ్‌తో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్ రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వ్యతిరేకం కాదు...అవకతవకలు సరిచేయిండి వెబ్‌ల్యాండ్‌కు మేము వ్యతిరేకం కాదు. వాటిలో ఉన్న అవకతవకలను సరిచేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం మా భూములను ఆన్లైన్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా భూముల ఆధారాలు, పత్రాలు మాత్రం మా వద్దే భద్రంగా ఉండాలి. అప్పుడే మాకు నిశ్చింతగా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా మేము స్వాగతించలేం. – యాళ్ల వెంకటానందం, బీకేఎస్ కోనసీమ నాయకుడు 271 జీవోను రద్దు చేయాలి పట్టాదారు పాస్ పుస్తకాల రద్దుకు కారణమవుతున్న వెబ్‌ల్యాండ్ విధానాన్ని తెచ్చిన జీఓనెం.271ని ప్రభుత్వం రద్దు చేయాలి. లేదా క్షేత్రస్థాయిలో భూములను రీ సర్వే చేయించి వెబ్ సమస్యలు తొలగించాలి. ఈ రెండు చేయకుండా వెబ్‌ల్యాండ్ భారాన్ని రైతుల నెత్తిన రుద్దితే ఊరుకోం. వెబ్‌లో ఆన్లైన్ 40 శాతం భూములు కూడా ఇంకా నమోదు కాలేదు. అప్పుడే ప్రభుత్వం 90 శాతం పూర్తయిందని చెబుతూ ఈ కొత్త విధానాన్ని అమలు చేపట్టి భూమి హక్కులను హరించేలా చేస్తోంది. – పాలూరి సత్యానందం, బీజేపీ రైతు నాయకుడు హక్కు పత్రంతోనే రైతుకు ధైర్యం ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ ఆన్లైన్ ద్వారా భూములకు ఎంత భద్రత కల్పించినా అది రైతులకు ధైర్యాన్ని నింపలేవు. తమ భూముల తాలూకు హక్కు పత్రాలు తన ఇంట్లో భద్రంగా ఉంటేనే ధైర్యం ఉంటుంది. ప్రభుత్వం ఆ భరోసా, ధైర్యాన్ని వెబ్‌తో లాగేసుకున్నట్టుగా ఉంది. ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం రైతు వద్దే ఉండేలా చేస్తేనే రైతులకు ఈ కొత్త విధానంపై నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే అనుమానమే. – కోరుమిల్లి సత్యనారాయణాచార్యులు, రైతు, విశ్రాంత ఉపాధ్యాయుడు రెవెన్యూ అధికారులకూ అవగాహన లేదు వెబ్‌ల్యాండ్‌పై కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలకే అవగాహన లేదు. పంట పొలాల్లో ఉండే రైతులకు ఏం ఉంటుంది. ఎరిరైనా రైతు కంప్యూటర్ ముందు కూర్చుని తన భూముల వివరాలను ఆన్లైన్ చుసుకోగలడా...? రైతులకే అనువుగా లేని అవగాహన లేని ఈ కొత్త విధానం ఎవరి కోసం అమలు చేస్తున్నారు. – రాయపురెడ్డి జానకిరామయ్య, ముమ్మిడివరం మండల రైతు నాయకుడు రైతు మానసికంగా కుంగిపోతున్నాడు వెబ్‌ల్యాండ్‌లో తమ భూములు సరిగా లేకపోవడం, వేరే సర్వే నంబర్లలో కనిపించడం... ప్రభుత్వ భూముల్లో ఉండడం వంటి గందర గోళ పరిస్థితులు చూసి రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోనన్న ఆందోళనతో ఉంటున్నాడు. వెబ్‌ల్యాండ్‌ను రద్దు చేసి రైతుల్లో ధైర్యాన్ని నింపాలి. – పత్తి దత్తుడు, రైతు అంబాజీపేట వెబ్ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా వెబ్‌ల్యాండ్ వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులుగా తాము సిద్ధంగా ఉన్నాం. రైతులు వెబ్ ఇబ్బందులు ఉంటే తమకు దరఖాస్తు చేసుకుంటే వాటిని సవరిస్తాం. గతంలో కర్ణం, మునసబు వ్యవస్థలో భూములపరంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమే. అప్పటి తప్పిదాలే ఇప్పుడు ఆన్‌లైన్‌కు వచ్చే సరికి ఇబ్బంది పెడుతున్నాయి. – నక్కా చిట్టిబాబు, తహసీల్దార్, అమలాపురం భూముల హెచ్చు తగ్గులు చూపిస్తున్నాయి వెబ్‌ల్యాండ్‌లో తమకున్న భూములు లేని భూమిని ఎక్కువగా చూపిస్తూ... మరికొన్ని చోట్ల ఉన్న భూమిలోనే కొంత భూమి వేరొకరి సర్వే నెంబరులో చూపిస్తోంది. సమగ్ర సర్వే, మ్యూటేషన్ ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆన్లైన్ పూర్తి కాకుండా పాస్ పుస్తకాలు రద్దు చేయడం తగదు. – అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం మండల రైతు నాయకుడు దశలవారీగా సమస్యల పరిష్కారం వెబ్‌ల్యాండ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని జిల్లాలో సర్వేనెంబర్లు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ల ద్వారా జరుగుతున్న తప్పిదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రశేపెట్టింది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వెబ్ల్యాండింగ్ ద్వారా తమ భూముల్లో తేడాల సవరణకు దరఖాస్తులు చేసుకుంటే సవరణలకు సిద్ధంగా ఉన్నాం. – గణేష్‌కుమార్, ఆర్డీఓ, అమలాపురం రీ సర్వే చేయాల్సిందే... ఖర్చులు మేమే భరిస్తాం ఏ సమస్యకైనా పరిష్కారం చూపినప్పుడు గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి. మీరు ఇప్పుడు వెబ్‌ల్యాండ్ అనే పరిష్కారం చూపినా అప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇదే పరిష్కారమంటే ఎలా? వెబ్‌ల్యాండ్ అంతా గందరగోళంగా, సమస్యల పుట్టలా ఉంది. వెబ్‌ల్యాండ్, ఆన్లైన్ ద్వారా మీరు పరిష్కరించదలుచుకుంటే ముందు క్షేత్రస్థాయిలో మొత్తం భూములన్నీ రీ సర్వే చేయించి ఓ స్పçష్టతకు రావాలి. అప్పుడే భూముల వాస్తవ తాజా చిత్రం వస్తుంది. ఆ సర్వేకయ్యే ఖర్చులు అవసరమైతే రైతులే భరిస్తాం. – రంబాల బోసు, కోనసీమ రైతు సంఘం ప్రతినిధి. వెబ్‌ల్యాండ్ తేడాలతో పరిహారం అందడం లేదు అమలాపురం మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఆ రోడ్డు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలు వెబ్‌ల్యాండ్ ఆన్లైన్లో రకరకాల తేడాలతో ఉన్నాయి. దీంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందడంలో సాంకేతిస సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ సక్రమంగా జరిగి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. – జవ్వాది బుజ్జి, డీసీసీబీ డైరెక్టర్ ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్ వెతలు ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్ సమస్యలు అనేకం ఉంటున్నాయి. ఉమ్మిడి భూములు పంచుకునే అన్నదమ్ములకు వారి తండ్రి, ఆయన తండ్రి, ఆడపిల్లలకు కట్నాలు కింద ఇచ్చిన భూములు కాలక్రమంలో క్రయ విక్రయాలతో జరిగిన మార్పులు సక్రమంగా సబ్ డివిజన్ చేయకపోవడంతో వెబ్‌ల్యాండ్‌లో ఇబ్బందులు అనివార్యమవుతున్నాయి. ఈ సమస్యలు రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ద్వారా తొందరగా పరిష్కరిస్తేనే వెబ్ గందరగోళానికి తెరపడుతుంది. – జున్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు -
చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
కర్నూలు(లీగల్): న్యాయవాదులు చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో జిల్లాలోని ప్యానల్ అడ్వకేట్స్‌కు రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణా న్యాయవాదుల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరుకు చెందిన న్యాయవాది టి.సుబ్బారావు, విశాఖకు చెందిన ఆర్.శ్రీనివాసరావు, ఆళ్లగడ్డ సబ్ జడ్జి సి.ఎన్.మూర్తి, కర్నూలు ఐఎఫ్సీఎం మెజిస్ట్రేట్ కె.పద్మినిలు పాల్గొని వివిధ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ప్రేమావతి, రఘురాం, సుధాకర్, సబ్ జడ్జిలు శివకుమార్, లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జీలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, పి.రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఓంకార్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు వంద మంది ప్యానల్ అడ్వకేట్స్ శిక్షణలో పాల్గొన్నారు.