మనోజ్ బాజ్‌పాయ్ నటించిన తాజా హిందీ చిత్రం ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వంలో జీ స్టూడియోస్, వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, ఆసిఫ్ షేక్ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో, ప్రస్తుతం థియేటర్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జూన్ 7 నుంచి వీక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన లాయర్ సోలంకి పాత్ర సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. అందుకే బాగా కనెక్ట్ అవుతున్నారు. కథపరంగా విలన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా ఓ పదహారేళ్ల అమ్మాయి అనుభవిస్తున్న బాధ, ఆమె తరఫున న్యాయ పోరాటం చేస్తున్న సోలంకిల కోణంలోనే చూపించే ప్రయత్నం చేశాం. న్యాయవ్యవస్థకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాం. ఫోక్సో చట్టంపై తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్లీ తెలుగులో సినిమా చేస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment