
కోచి: కేరళలోని కొట్టాయానికి చెందిన బెన్నీ కొట్టార్తిల్ (53), ఆయన భార్య మోలీ బెన్నీ (46) దేశమంతటినీ కాలినడకన చుట్టొచ్చారు. ఈ ఘనత సాధించిన తొలి జంటగా నిలిచారు. 2021 డిసెంబర్ 1న కన్యాకుమారిలో మొదలు పెట్టి జూలై 3న ముగించారు. మొత్తం 17 రాష్ట్రాలను కవర్ చేశారు. ప్రజల్లో నడకపై అవగాహనను మరింత పెంచేందుకే పాదయాత్ర చేసినట్టు చెబుతున్నారు.
‘‘యాత్ర పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. బిహార్లో ఓ రాత్రి ఎక్కడా ఆశ్రయం దొరక్క శ్మశానంలో తలదాచుకున్నాం! పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం అన్నింటికంటే ఎక్కువగా నచ్చింది. ఆంధ్రా స్టైల్ భోజనానికి ఏదీ సాటి రాదు’’ అన్నారు. యాత్రానుభవాలను సొంత యూట్యూబ్ చానళ్లో పంచుకున్నారు. స్పాన్సర్లు దొరికితే మళ్లీ పాదయాత్రకు సిద్ధమంటున్నారు!
Comments
Please login to add a commentAdd a comment