డాక్టర్ గారూ! నా సమస్య మీకు వింతగా అనిపించవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నవలలు, వీక్లీలు... ఒకటేమిటి... ఏ పుస్తకం కనబడినా చదవడం అలవాటైంది. క్లాసు పుస్తకాలు చదువుతుంటే నేను చదివిన నవలల్లోని పాత్రలు, సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలి చదవలేక΄ోతున్నాను. దానివల్ల ఆ చదువు ముందుకెళ్ళడం లేదు. ఏదైనా కొత్త పుస్తకం కనబడితే, వెంటనే మొత్తం చదవక΄ోతే, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతుంది. ఆఖరుకు చెత్త కుండీలోని పేపరు ముక్కలు కూడా తీసి చదవందే మనసు నిలకడగా ఉండడం లేదు. ఈ అలవాటును ఎంత మానుకుందాం అనుకున్నా మానలేకపోతున్నాను. దీనివల్ల నేను బీటెక్ పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు.
– చందన, విజయనగరం
పుస్తకాలు, నవలలు చదవడం మంచి అలవాటే! కానీ ఏ అలవాటైనా అతిగా చేయడం మంచిదికాదు. కొత్త పుస్తకం కనబడిన వెంటనే మొత్తం చదవాలనే తపన, చదవక΄ోతే ఏదో తెలియని అలజడి ఇవన్నీ ఒక ఎత్తైతే, చివరకు చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా ఏరుకుని చదవందే ఉండలేక΄ోవడమనేది ఖచ్చితంగా ఒక మానసిక రుగ్మతే! ‘ఆబ్‌సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అనే మానసిక జబ్బుకు లోనైనవారే ఇలా ప్రవర్తిస్తారు. అలా అతిగా చదవాలనే తపన పడటం, ఆ అలవాటును మీరు మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవడం ఈ మానసిక సమస్య ముఖ్య లక్షణం.
మెదడులోని ‘సెరొటోనిన్’ అనే ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు, మీరు చెప్పిన లాంటి లక్షణాలు బయటపడతాయి. ‘క్లోమిప్రెమిన్ ప్లూ ఆక్సిటెన్’ అనే మందుల ద్వారాను, ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారానూ ఈ సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయట పడేయవచ్చు. మీరు వెంటనే మంచి సైకియాట్రిస్ట్ట్‌ను కలిస్తే మీ సమస్యకు తగిన చికిత్స చేస్తారు. మీరు మీ బీటెక్ చదువు త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయగలరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్!
ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
(చదవండి: ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’)
Comments
Please login to add a commentAdd a comment