![Shooter Vijay Kumar Studying Law In Lockdown Holidays - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/13/Vijay.jpg.webp?itok=xjapKbyW)
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కాలాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సరదాగా గడుపుతుంటే ఒలింపిక్ రజత పతక విజేత, భారత స్టార్ షూటర్ విజయ్ కుమార్ చదువుపై దృష్టి కేంద్రీకరించాడు. 2017లో ఇండియన్ ఆర్మీ నుంచి రిటైరయ్యాక హిమాచల్‌ప్రదేశ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా చేరిన విజయ్ ఈ ఖాళీ సమయాన్ని ‘లా’ చదివేందుకు వినియోగించుకుంటున్నాడు. ఆన్‌లైన్ తరగతుల సహాయంతో న్యాయవిద్యను అభ్యసిస్తున్నట్లు విజయ్ తెలిపాడు. ‘డీఎస్పీ ట్రెయినింగ్‌లో భాగంగా శారీరక వ్యాయామాలు, న్యాయవిద్య తరగతులకు హాజరు కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా డోరాలోని ట్రెయినింగ్ సెంటర్‌లో జరగాల్సిన శారీరక శిక్షణ వాయిదా పడింది. కానీ ఆన్‌లైన్‌లో ‘లా’ తరగతులకు హాజరు అవుతున్నా’ అని 34 ఏళ్ల విజయ్ కుమార్ తెలిపాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో విజయ్ రజతం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment