ప్రత్యేక చట్టాల అమలుకు డిమాండ్
Published Mon, Mar 13 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
- యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి డిమాండ్
-శంకరాస్ డిగ్రీ కాలేజీలో డైరీ ఆవిష్కరణ
కర్నూలు(అర్బన్): ఎస్‌సీ, ఎస్‌టీల తరహాలోనే యాదవులకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2017 డైరీని స్థానిక శకరాస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నయాదవ్ మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ బీసీ కులాలకు ఏర్పాటు చేసిన విధంగా ప్రత్యేక ఫైనాన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో యాదవ సొసైటీలకు పదెకరాల భూమిని కేటాయించాలన్నారు. త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో యాదవులకు మేయర్ పదవిని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్యయాదవ్, ఆర్‌ఆర్ హాస్పిటల్ అధినేత డా.బాలమద్దయ్య, వైహెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement