yadavs
-
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల పోరు పశి్చమ యూపీ నుంచి యాదవ భూమికి చేరింది. బ్రజ్, రోహిఖండ్ ప్రాంతాల్లోని 10 లోక్‌సభ స్థానాలకు 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. యాదవులు, ముస్లింలు ఒక్కటైతే అక్కడ వారి తీర్పే ఫైనల్. వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీకి మూడో విడత అగ్నిపరీక్ష కానుంది. యూపీలో తొలి రెండు విడతల్లో జాట్ బెల్ట్‌గా భావించే పశి్చమ యూపీలోని 16 స్థానాలకు పోలింగ్ ముగియడం తెలిసిందే... సంభల్ యాదవ ఆధిపత్య స్థానమిది. దివంగత ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ 1998, 1999ల్లో ఇక్కడి నుంచే లోక్‌సభకు వెళ్లారు. 2004లోనూ ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత సత్యపాల్ సింగ్ సైని గెలిచారు. 2019లో ఎస్పీ నేత షఫీకుర్ రెహమాన్ బార్క్ భారీ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈసారి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జియావుర్ రెహమాన్‌కు ఎస్పీ టికెటిచి్చంది. బీజేపీ మళ్లీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్ లాల్ సైనీనే రంగంలోకి దింపింది. బీఎస్పీ నుంచి షౌలత్ అలీ పోటీ చేస్తున్నారు.హథ్రస్ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 1991 నుంచీ బీజేపీ కంచుకోట. కాంగ్రెస్ అయితే 1971 తర్వాత ఇక్కడ ఎన్నడూ గెలవలేదు! ఇక ఎస్పీ, బీఎస్పీ ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలుపు ముఖమే చూడలేదు! 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ఇక్కడ విజయం సాధించింది. 2019లో ఎస్పీ అభ్యర్థి రామ్‌జీ లాల్ సుమాన్‌పై బీజేపీ అభ్యర్థి రాజ్వీర్ సింగ్ దిలార్ 2.6 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల దిలార్ ఏప్రిల్ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో బీజేపీ టికెట్ అనూప్ ప్రధాన్‌కు లభించింది. ఎస్పీ తరఫున జస్వీర్ వాలీ్మకి పోటీ చేస్తున్నారు.బరేలీ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ గంగ్వార్ ఇక్కడి నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ తరఫున గెలిచారు! ఒక్క 2009 మినహాయిస్తే 1989 నుంచి అన్ని ఎన్నికల్లో గంగ్వార్దే గెలుపు! ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఛత్రపాల్ సింగ్ గంగ్వార్‌కు టికెటిచి్చంది. ఎస్పీ నుంచి ప్రవీణ్ సింగ్ అరాన్ బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి చోటేలాల్ గంగ్వార్ నామినేషన్ తిరస్కరణకు గురవడం ఆ పారీ్టకి షాకిచి్చంది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీయే నెలకొంది.ఫతేపుర్ సిక్రీ 2009లో ఈ స్థానాన్ని బీఎస్పీ సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల నుంచి మాత్రం బీజేపీదే విజయం. 2019లో ఆ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ చాహర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్‌కు 1.72 లక్షల ఓట్లు పోలైతే, చాహర్ ఏకంగా 6.67 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు! దాంతో ఈ విడత కూడా చాహర్‌కే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రామ్‌నాథ్ సికర్వార్, బీఎస్పీ నుంచి రామ్నివాస్ శర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ మాజీ నేత భగవాన్ శర్మ (గుడ్డూ పండిట్) స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో ఉండటం కాంగ్రెస్‌కు ప్రతికూలం కానుంది.బదాయూ ఎస్పీకి కీలకమైన స్థానమిది. 1996 నుంచి 2014 దాకా ఆ పారీ్టకి కంచుకోట. 2009, 2014ల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ నెగ్గారు. 2019లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య ఆయనపై కేవలం 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విడత దురి్వజయ్ శాక్యను బీజేపీ పోటీలో దించింది. ఎస్పీ కూడా సీనియర్ నేత శివపాల్ యాదవ్ ఒత్తిడితో ఆయన కుమారుడు ఆదిత్యకు టికెటిచ్చింది. ధర్మేంద్ర యాదవ్‌ను పక్కన పెట్టడం దానికి ప్రతికూలంగా మారొచ్చంటున్నారు.ఫిరోజాబాద్ ఇదీ ఎస్పీ ఆధిపత్యమున్న స్థానమే. 2009లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, 2014లో ఆయన సోదరుడు అక్షయ్ యాదవ్ విజయం సాధించారు. 2019లో మాత్రం ఫిరోజాబాద్ బీజేపీ పరమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రసేన్ జడాన్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అక్షయ్ యాదవ్‌పై గెలిచారు. ఈసారి ఎస్పీ నుంచి మళ్లీ అక్షయ్ బరిలో ఉన్నారు. బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీని మార్చి విశ్వదీప్ సింగ్‌కు టికెటిచి్చంది.ఎటా ఆది నుంచీ బీజేపీని ఆదరిస్తున్న స్థానమిది. 1999, 2004 ఎన్నికల్లో మాత్రం ఎస్పీ నెగ్గింది. 2009 ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం విశేషం! ఆయన కుమారుడు రాజ్వీర్సింగ్ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ తరఫున దవేశ్ శాక్య, బీఎస్పీ నుంచి మహమ్మద్ ఇర్ఫాన్ బరిలో ఉన్నారు.ఆవ్లా 1989 నుంచి బీజేపీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 2009 నుంచి ఆ పారీ్టకే ఇక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మేంద్ర కశ్యప్‌కే ఈసారి కూడా బీజేపీ టికెట్ దక్కింది. ఎస్పీ నుంచి నీరజ్ మౌర్య, బీఎస్పీ తరఫున అబిద్ అలీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2014లో ఎస్పీ, 2019 ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి.బీజేపీ హవా కొనసాగేనా!? మూడో విడతలో పోలింగ్ జరిగే 10 స్థానాల్లో ఎనిమిది 2019లో బీజేపీ గెలుచుకున్నవే. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి బరిలో దిగగా బీఎస్పీ ఒంటరి పోరు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాటి మధ్య చీలితే బీజేపీ లాభపడనుంది. ఈ 10 లోక్‌సభ స్థానాల్లో ముస్లింలతో పాటు ఓబీసీలు, ముఖ్యంగా యాదవ్‌ల పాటు ఓట్లు ఎక్కువ. ఎటా, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, బుదౌన్, సంభాల్ యాదవ ప్రాబల్య స్థానాలు. సంభాల్, ఆవ్లా, ఫతేపుర్ సిక్రీ, ఆగ్రా, ఫిరోజాబాద్‌ల్లో ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. బరేలీలోనైతే ఏకంగా 33 శాతం దాకా ఉంటారు! ఇతర లోక్‌సభ స్థానాల్లో లోధ్, కచి్చ, శాక్య, మురావోల ప్రాబల్యమూ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టక్కుటమారి.. టముకుతో సరి
నరసరావుపేట ఎంపీ, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల కేటాయింపుసాక్షిప్రతినిధి, ఒంగోలు: జయహో బీసీ... అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్ను విరిచారు. కానీ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ మూడు జిల్లాల్లో 50 శాతానికి పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయితే ఆ జిల్లాల్లో పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు. కానీ యాదవులకు వైఎస్సార్సీపీ సముచిత స్థానం కల్పించింది. ఆ జిల్లాల్లో వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీదా మస్తాన్‌రావును రాజ్యసభకు పంపింది. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీకి సాధారణ జెడ్పీటీసీ సభ్యుడిని ప్రకటించి సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీకి పోటీలో నిలబెట్టింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి చెందిన యాదవ నేత జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చాన్సే లేకుండా పోయింది. ఆయన గురజాల టికెట్ కావాలని వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో ఆయనకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దులూరి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి బాబు మొండిచేయి చూపారు. యాదవుల్లో సమర్థులు లేరా? ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో టీడీపీలో యాదవ సామాజికవర్గానికి చెందిన సమర్థులు లేరా? ఒకప్పటిలా టీడీపీ పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లిచ్చి సీఎం జగన్ యాదవులను ఎంతగానో గౌరవించారు. మాకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఆదరిస్తాం. – మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచారు
ముజఫర్‌పూర్: బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను ఉద్దేశపూ ర్వకంగానే ఎక్కువ చేసి చూపించిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మొత్తమ్మీద వెనుకబడిన కులాల వారికి మొండిచేయి చూపిందని చెప్పారు. ముజఫర్‌పూర్ జిల్లా పటాహిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ముస్లింల పట్ల అనుసరిస్తున్న బుజ్జగింపు వైఖరి ఫలితంగా నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తప్పవని నితీశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కోరారు. ‘నితీశ్ కుమార్ ప్రధాని పీఠంపై ఆశలు వదులుకోవాలి. అది ఎన్నటికీ జరగ దు. ఇండియా కూటమికి కనీసం ఆయన కన్వీనర్ అయినా కాలేకపో యారు. బిహార్‌లో గూండారాజ్యాన్ని తిరిగి రావడానికి ఆయనే బాధ్యుడు’అని ఆరోపించారు. గతంలో కులగణనకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఓబీసీలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పుడు అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతానంటోందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో అధికారం పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయంటూ అమిత్ షా, ఈ కూటమి ఏకైక ఎజెండా ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఈ కూటమి పార్టీలు వ్యతిరేకించాయని కూడా మంత్రి చెప్పారు. కేంద్ర కేబినెట్లో 27 మంది మంత్రులు, అంటే 35 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారేనన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఓబీసీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు. -
చట్ట సభల్లో యాదవుల నాయకత్వం పెరగాలి
నాగోల్: రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారంరాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని యాదవ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నాగోల్‌లో యాదవ యుద్ధ భేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు పా ర్టీలు, యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి తలసాని మాట్లాడు తూ చట్టసభల్లో యాదవుల నాయకత్వం పెరగాల ని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో 25లక్షల మంది యాదవులతో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామన్నారు. యాదవుల్లో ఐక్యత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరా రు. యాదవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు. యాదవ నాయకుడు ప్రధాని కావాలి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గొల్ల కురుమలతోపాటు అన్ని బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. రాజకీయ పా ర్టీల బీఫామ్ కోసం బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించిందని, బీసీలే బీ ఫామ్‌లు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా రు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలందరూ ఏకమై రాజ్యా ధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అంబర్‌పే ట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను యాదవ సంఘ నేత ఆర్.లక్ష్మణ్ యాదవ్‌కు ఇస్తామని, ఐక్యంగా గె లిపించుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 20 శాతం జనాభా ఉన్న యాదవ నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై యాదవ డిక్లరేషన్‌ను చలకాని వెంకట్ యాదవ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
యాదవుల అభ్యున్నతికి ప్రణాళిక
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బీసీల్లో యాదవులను అతి పెద్ద క్యాస్ట్‌గా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మన జాతి అభ్యున్నతికి ఒక ప్రణాళిక సిద్ధం అవుతోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు. అఖిలభారత యాదవ మహాసంఘం ఆవిర్భావం సందర్భంగా ఆదివారం విజయవాడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాజికవర్గానికి సంబంధించిన సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్‌ను చేశారని గుర్తుచేశారు. తనకు మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవ జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని, జాతి తలదించుకునే పని మాత్రం చేయనని స్పష్టంచేశారు. యాదవ జాతి ఒక్కటే ఓట్లు వేస్తే గెలవలేదని, మిగిలిన సామాజికవర్గాల ప్రజల మద్దతు కూడా లభించటం వల్లనే విజయం సాధించానని తెలిపారు. ప్రాంతాలను, పార్టీలను, కులమతాలను చూడం.. అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్న విధంగా తుదిశ్వాస వరకు అందరివాడిగానే ఉంటానని చెప్పారు. ఏపీలో ప్రతి జిల్లాలో యాదవభవన్ కోసం కనీసం రెండెకరాలు ఇప్పించాలని తెలంగాణ నుంచి వచ్చిన వి.చినశ్రీశైలంయాదవ్ కోరగా.. ప్రతి జిల్లాలో ఒక ఎకరం, హెడ్‌క్వార్టర్‌లో ఐదెకరాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. బీసీ వర్గాలకు జెండా, అజెండా ఉండాలి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ సంఘాలు రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండాలన్నారు. బీసీ వర్గాలకు ఒక జెండా, అజెండా ఉండాలని చెప్పారు. సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో సన్నిధి గొల్లలకు చట్టబద్ధత కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 45 ఏళ్లు దాటిన గీత, చేనేత కార్మికులకు ఇచ్చినట్లుగానే గొర్రెల కాపలాదారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు యు.పేరయ్య, నేతలు బచ్చుల అర్జునుడు, పీఎల్‌పీయాదవ్, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, సంఘం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు ఎన్.సునీల్, ఆర్.సత్యశేఖర్, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని యాదవ సామాజికవర్గ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
సదర్ కింగ్..సర్తాజ్
మహానగరానికే ప్రత్యేకమైన సదర్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్‌ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్‌లో ‘సర్తాజ్’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన ‘సర్తాజ్’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సాహం
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు రాజకీయంగా ఎదగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల్లోని కేసారం, నారాయణగూడెం, కాసరబాద గ్రామాలకు చెందిన వివిధపార్టీల నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడారు. గత పాలకుల వల్ల కానీ విధంగా యాదవులను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు, సంకరమద్ది రమణారెడ్డి, సైదులు, మండలి కృష్ణ, అచ్చాలు పాల్గొన్నారు. అభివృద్ధే.. మంత్రిని గెలిపిస్తుంది నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి సతీమణి గుంటకండ్ల సునీతజగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గండూరి పావని, వూర గాయత్రి, సల్మా, రాచూరి రమణ, కరుణ, శనగాని అంజమ్మ, అన్నపూర్న, వెంకటమ్మ పాల్గొన్నారు. విజయాంజనేయస్వామి ఆలయంలో పూజలు మంత్రి జగదీశ్రెడ్డిభారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ 7వ వార్డులో విజయాంజనేయస్వామి దేవాలయంలో ఆ వార్డు అధ్యక్షుడు కొండపెల్లి దిలీప్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణ, దాసరికిరణ్, మాధవి, చంద్రకళ, సైదులు, వెంకటేష్ పాల్గొన్నారు. భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.. మంత్రి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ 8వ వార్డులో కౌన్సిలర్ నిమ్మల వెంకన్న ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయన వెంట రామకృష్ణ, సతీష్, సత్యనారాయణ, సత్యం, వెంకటేష్, రాజేష్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక సూర్యాపేటరూరల్ : మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో అలకుంట్ల లింగయ్య, శివరాత్రి యాదగిరి, రూపాని పెద్ద మల్లయ్య, సతీష్, నర్సింహా, గుర్రం వెంకటేశ్వర్లు, వెంకటేశ్, శేఖర్‌తో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్, వంగాల శ్రీనువాస్‌రెడ్డి, రామసాని శ్రీనువాస్నాయుడు, మామిడి తిరుమల్, నరేష్, మోతీలాల్, తదితరులు పాల్గొన్నారు. చివ్వెంల : టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారంగుంపుల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నెమ్మాది భిక్షం, ఊట్కూరి సైదులు, నారాయణ రెడ్డి పగడాల లింగయ్య, ఎసోబ్, నాతాల శేఖర్‌రెడ్డి, కోలా శ్రీనివాస్, నాగయ్య, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రెడ్డి మధు పాల్గొన్నారు. ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి పెన్‌పహాడ్ : ఈ నెల 23న సూర్యాపేటలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద విలేకర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య పద్మ, జెడ్పీటీసీ పిన్నెని కోటేశ్వర్రావు, నర్సింహ్మరెడ్డి, వెంకటేశ్వర్లు, భిక్షం, ఇంద్రసేనారావు, సీతారాంరెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ, శ్రీనివాస్, కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన యాదవులు
-
యాదవుల నిరసన ర్యాలీ
ఏలూరు (వన్‌టౌన్) : టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడం దారుణమని, అది పూర్తిగా అసత్యమని యాదవ సంఘం నేతలు స్పష్టం చేశారు. సుధాకర్‌యాదవ్‌పై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగర యాదవ సంఘం కన్వీనర్ మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు ఊక్కుసూరి గోపాలకృష్ణ, మల్లిపూడి రాజు, కీలరపు జగదీష్, కీలారు బుజ్జి, తలారి గోపి యాదవ, పిలకల ప్రకాశరావు పాల్గొన్నారు. -
యాదవులను విస్మరిస్తే బుద్ధి చెబుతాం
– అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు – భారీగా యాదవ శంఖారావ చైతన్య రథయాత్ర ర్యాలీ కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా రాజకీయ అణచివేతకు గురవుతున్న యాదవులను విస్మరిస్తే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, ఏపీ బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్రయాదవ్ అన్నారు. ఈ నెల 14వ తేది నుంచి జిల్లాలో ప్రారంభం అయిన యాదవ శంఖారావ రథయాత్ర శుక్రవారం ఉదయం కర్నూలులోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో యాదవ నేతలు స్థానిక బళ్లారి రోడ్డు రేడియో స్టేషన్ నుంచి నంద్యాల రోడ్డు దేవీ ఫంక్షన్ హాల్ వరకు కారు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవీ ఫంక్షన్ హాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె. లక్ష్మీనరసింహ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. ప్రజలందరికీ పాలు, పెరుగు, నెయ్యి, మాంసం వంటి మంచి ఆహారాన్ని అందిస్తున్నది యాదవులేనన్నారు. యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని యాదవులకు కేటాయించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలంలో యాదవ భవనం నిర్మించాలని, పరిశ్రమల స్థాపనకు, డెయిరీల ఏర్పాటు చేసుకునేందుకు యాదవ యువతకు 70 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలన్నారు. యాదవుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సరైన సందర్భంలో బుద్ధి చెబుతామన్నారు. 2019లో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 30 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలు యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులు యాదవ్, జేఏసీ అధికార ప్రతినిధి రాజేశ్వరరావు, జేఏసీ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, మిడుతూరు శ్రీనివాసులు, టీడీపీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, అయ్యన్న యాదవ్, దండు శేషు యాదవ్, బీజేపీ మాజీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక చట్టాల అమలుకు డిమాండ్
- యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడి డిమాండ్ -శంకరాస్ డిగ్రీ కాలేజీలో డైరీ ఆవిష్కరణ కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీల తరహాలోనే యాదవులకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2017 డైరీని స్థానిక శకరాస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నయాదవ్ మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ బీసీ కులాలకు ఏర్పాటు చేసిన విధంగా ప్రత్యేక ఫైనాన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో యాదవ సొసైటీలకు పదెకరాల భూమిని కేటాయించాలన్నారు. త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో యాదవులకు మేయర్ పదవిని కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్యయాదవ్, ఆర్ఆర్ హాస్పిటల్ అధినేత డా.బాలమద్దయ్య, వైహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సోమేష్‌యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
కబడ్డీలో దళితుల చేతిలో ఓడిపోవడంతో..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరియాణాలో ప్రతి ఏడాది వివిధ కులాల మధ్య కబడీ పోటీలు జరుగుతాయి. కులాల మధ్య ఐక్యత పెంచడం ఈ స్నేహపూర్వక పోటీల వెనుక ప్రధానోద్దేశం. కానీ, ఈసారి గురుగావ్‌లో జరిగిన క్రీడాపోటీలు మాత్రం కులాల మధ్య ఐక్యత పెంచడానికి బదులు చిచ్చు రాజేశాయి. తాజా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దళితుల జట్టు, యాదవుల జట్టు మధ్య జరిగిన కబడ్డీ పోటీ హింసాత్మకంగా మారింది. దళితుల జట్టు యాదవుల జట్టుపై గెలుపొందింది. ఇదే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించారు కూడా. అయితే, దీంతో యాదవుల జట్టు ఆగ్రహానికి లోనై.. దళితుల కబడ్డీ జట్టు సభ్యులపై దాడికి దిగినట్టు సమాచారం. ఈ దాడిలో ఓ ఆటగాడికి కాలువిరిగి, తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి తలపై గాయమైంది. ఇరు జట్లకు చెందిన మరో పదిమంది కూడా ఈ హింసలో గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు గురుగావ్‌లోని ఉమా సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగావ్ జిల్లా చక్కార్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన దళితులు, యాదవులు, జాట్లు, గుజ్జర్లు, బెనియాలు, అగర్వాళ్ల జట్లు పాల్గొన్నాయని ఓ జాతీయ ఆంగ్లపత్రిక తెలిపింది. అయితే, రాష్ట్రంలో కులపరమైన క్రీడాపోటీలు జరుగడం లేదని, ఒకే కులం వారు ఒక జట్టు నిండా ఉన్నా అది యాదృచ్ఛికమే కానీ కులాలవారీగా జట్లు లేవని స్థానిక కౌన్సిలర్ సునీల్ యాదవ్ చెప్పుకొచ్చారు. -
6న అఖిల భారత యాదవ జిల్లా కార్యనిర్వాహక సమావేశం
వీరన్నపేట : ఈ నెల 6న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు మహాస¿¶ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మినరసింహయాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో జిల్లాల విభజన దృష్ట్యా జిల్లా కార్యవర్గాన్ని విస్తరణ, 2015–16 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరచిన యాదవ విద్యార్థుల సన్మాన కార్యక్రమం, నియోజకవర్గాల వారిగా యాదవ మహాసభ సదస్సుల ఏర్పాటు అంశాలపై చర్చించనున్నామని వెల్లడించారు. అంతేగాక జిల్లా గొర్రెల కాపరుల యూనియన్ కార్యకలాపాలు, ఎన్సీడీసీ రుణాలపై చర్చించడం, జిల్లాకు ఏ రుణాలు మంజూరయ్యాయనే అంశంపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రస్థాయి నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రాందాస్యాదవ్, చందుయాదవ్, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పాండుయాదవ్, ప్రాథమిక గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు సాయిలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక మిగిలింది ముస్లిం, యాదవుల చేతిలోనే!
పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న బీహార్ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. గురువారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇది పూర్తయితే, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్లే. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికలు ఒక ఎత్తుకాగా, ఈ ఐదో దశ మాత్రం మరోఎత్తు. ఎందుకంటే, గురువారం ఎన్నికలు జరగనున్న 57 నియోజవర్గాలు కూడా ముస్లింల, యాదవుల హవా ఉన్న ప్రాంతాలు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ది కూడా యాదవుల సామాజిక వర్గం కావడంతో మిగితా నియోజవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఈ నియోజవర్గాల్లో మాత్రం మోదీ హవా కన్నా నితీశ్, లాలూ హవా కొనసాగే అవకాశం ఉంది. పైగా దేశ వ్యాప్తంగా మోదీ ప్రభావం ఉన్న సమయంలోనే ఇక్కడ బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి చతికిలపడింది. ఇప్పటికే ఓ వ్యూహం ప్రకారమే ముస్లిం వ్యతిరేక చర్యలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని దేశ వ్యాప్తంగా నిరసనలు రచ్చకెక్కడం కూడా బీజేపీకి కొంత ప్రతికూలంగా ఉన్న అంశం. మరోపక్క, తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ తమ పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టి బీజేపీపై ముస్లింలకు ఉన్న వ్యతిరేకతను తమకు ఓట్లుగా మార్చుకునే దిశగా ముందడుగులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికంతో నిండిఉండటమే కాకుండా వలసదారులు కూడా అధికమే. సిమాంచల్, కిషన్ గంజ్, పుర్నియా, ఖతిహార్, అరేరియాలో ఎక్కువగా ముస్లింలు ఉండగా, మదిపురా, సహస్రాలో ఎక్కువగా యాదవులు ఉన్నారు. ముస్లింలు, యాదవులు మాత్రమే ఈ నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తారని ప్రముఖ రాజకీయ వేత్త మహేందర్ యాదవ్ కూడా అన్నారు. దీంతో మొత్తం ఏడు జిల్లాల్లో జరగనున్న తుది పోరులో ఓటర్లు ఏ పార్టీల అభ్యర్థిని పలకరిస్తారనేది తెలుసుకునేందుకు ఫలితాలు వెల్లడయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. -
పెద్దగట్టుకు పీట
⇒ రూ.2.10 కోట్లు మంజూరు ⇒సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటన ⇒హర్షం వ్యక్తం చేస్తున్న యాదవులు ⇒ వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీదాకా ⇒లింగమంతులస్వామి జాతర సూర్యాపేట : రాష్ట్రంలోనే మేడారం తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు మహర్దశ పట్టనుంది. ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.2.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం రాష్ట్ర రాజధానిలో జాతరపై నిర్వహించిన సమీక్షసమావేశంలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు. దీంతో లక్షలాది మంది యాదవుల ఆరాధ్య దైవమైన దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ప్రతి రెండేళ్లకోసారి లక్షలాది మంది తరలివచ్చి ఘనంగా నిర్వహించుకునే ఈ జాతరలో అరకొర వసతులతో భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. గత రెండు జాతర్లకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ మంజూరు కాలేదు. సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే రెండు విడతలుగా రూ.5 లక్షల చొప్పున తన నిధుల నుంచి కేటాయించి, చిన్నగా దేవాలయాల స్థానంలో పెద్ద దేవాలయం నిర్మాణం, మహామండపం నిర్మాణాన్ని చేపట్టారు. వేలం పాట నిధులతోనే జాతర నిర్వహణ.. జాతరలో నిర్వహించే వేలం పాటలతో వచ్చే నిధులతోనే అరకొర వసతులు ఏర్పాటు చేసేవారు. తలనీలాలు, కొబ్బరికాయలు, దుకాణాల కేటాయింపు తదితర వాటి వేలంపాటకు వచ్చిన డబ్బులతోనే జాతర నిర్వహించేవారు. శాశ్వత నిర్మాణాలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అనేక మంది మేధావులు, భక్తులు దురాజ్‌పల్లి జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ వస్తున్నారు. దీంతోపాటు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో చర్చించి పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించేందుకు తన వంతు కృషిచేశార. ఆ నిధులతో జాతరలో మహిళలకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, శాశ్వత తాగునీటి వసతి ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అదే విధంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా గుట్ట చుట్టూ స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. 20 లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశం వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సుమారు 20 లక్షలకు పైగా భక్తులు తరలిరానున్నారు. గతంలో 3 రోజులు మాత్రమే నిర్వహించే జాతరను ఈసారి 5 రోజులు నిర్వహించనున్నారు. -
యాదవుల గుస్సా!
చీరాల, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులు అధికంగా టీడీపీ వెంట నడిచారు. పార్టీ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలుగా ఉండేవారు. అభ్యర్థులెవరైనా సరే నిక్కచ్చిగా పార్టీ కోసమే పనిచేసేవారు. టీడీపీతో అప్పట్లో యాదవ సామాజిక వర్గానికి విడదీయరాని బంధం ఉండేది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూడా పార్టీలో యాదవ సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ క్రమంలోనే జిల్లాలో చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు వంటి నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారు. టీడీపీ పగ్గాలు చంద్రబాబునాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజిక వర్గంపై చిన్నచూపు చూడటం మెదలు పెట్టాడు. అందుకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్క నియోజకవర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి టీడీపీ టికెట్ కేటాయించ లేదు. జిల్లాలో మూడు లక్షలకు పైచీలుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వీరికి ఉంది. ఆది నుంచి ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నా వీరికి ఈ సారి ఎక్కడా రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు స్థానాల కోసం యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ చిమాటా సాంబు, గోర్ల శ్రీనివాస్‌యాదవ్, ఎంఎం కొండయ్య, వైవీ సుబ్బారావు వంటి నేతలు ప్రయత్నించినా బాబు కరుణించలేదు. దీంతో ఆ సామాజిక వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ముందు నుంచీ పార్టీ కోసం శ్రమించిన త మకు ప్రాధాన్యత లేకుండా చేయడం అన్యాయమంటున్నారు. యాదవులను టీడీపీ విస్మరించింది బుర్ల రాము, అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ యాదవులను పూర్తిగా విస్మరించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా యాదవులు బాబుకు అండగా ఉన్నారు. జిల్లాలో 3 లక్షలకు పైచీలుక ఉన్న యాదవులకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపొవడం అన్యాయం. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని సైతం యాదవులకు కేటాయించింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరలైనా వైఎస్సార్ సీపీ మాత్రం యాద వ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీని బరిలోకి దించింది. కనిగిరి అసెంబ్లీ సీటును కూడా బుర్ర మధుసూదన్ యాదవ్‌కు ఇవ్వడంతో యాదవులాంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యాదవులను గుర్తించిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌కు టికెట్ కేటాయించింది. జనరల్‌కు రిజర్వ్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీ కూడా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చింది. కందుకూరు నుంచి రాచగొర్ల వెంక ట్రావ్, అద్దంకి నుంచి గాలం లక్ష్మికి అవకాశం కల్పించారు. అయితే చివర్లో గాలం లక్ష్మి స్థానంలో ఈదా సుధాకర్‌రెడ్డిని మార్చారు.