సదర్‌ కింగ్‌..సర్తాజ్‌ | 27 Crore worth Bison Is Ready For Exhibition | Sakshi
Sakshi News home page

సదర్‌ కింగ్‌..సర్తాజ్‌

Published Sun, Oct 27 2019 2:51 AM | Last Updated on Sun, Oct 27 2019 5:14 AM

27 Crore worth Bison Is Ready For Exhibition - Sakshi

మహానగరానికే ప్రత్యేకమైన సదర్‌ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్‌ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్‌. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్‌లో ‘సర్తాజ్‌’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన ‘సర్తాజ్‌’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్‌ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్‌ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.
– సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement