నాగోల్: రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారంరాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని యాదవ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నాగోల్‌లో యాదవ యుద్ధ భేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు.
యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు పా ర్టీలు, యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి తలసాని మాట్లాడు తూ చట్టసభల్లో యాదవుల నాయకత్వం పెరగాల ని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో 25లక్షల మంది యాదవులతో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామన్నారు.
యాదవుల్లో ఐక్యత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరా రు. యాదవుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు.
యాదవ నాయకుడు ప్రధాని కావాలి
బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గొల్ల కురుమలతోపాటు అన్ని బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. రాజకీయ పా ర్టీల బీఫామ్ కోసం బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించిందని, బీసీలే బీ ఫామ్‌లు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా రు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలందరూ ఏకమై రాజ్యా ధికారం సాధించాలని పిలుపునిచ్చారు.
అంబర్‌పే ట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను యాదవ సంఘ నేత ఆర్.లక్ష్మణ్ యాదవ్‌కు ఇస్తామని, ఐక్యంగా గె లిపించుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 20 శాతం జనాభా ఉన్న యాదవ నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందని తెలిపారు.
తెలంగాణలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై యాదవ డిక్లరేషన్‌ను చలకాని వెంకట్ యాదవ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment