
కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేస్తున్న యాదవ సంఘం నాయకులు
ఏలూరు (వన్‌టౌన్) : టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడం దారుణమని, అది పూర్తిగా అసత్యమని యాదవ సంఘం నేతలు స్పష్టం చేశారు.
సుధాకర్‌యాదవ్‌పై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నగర యాదవ సంఘం కన్వీనర్ మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు ఊక్కుసూరి గోపాలకృష్ణ, మల్లిపూడి రాజు, కీలరపు జగదీష్, కీలారు బుజ్జి, తలారి గోపి యాదవ, పిలకల ప్రకాశరావు పాల్గొన్నారు.