స్త్రీ సాధికార చట్టాలపై వర్క్‌షాప్
Published Wed, Jan 11 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
కర్నూలు: కర్నూలు శివారులోని పుల్లయ్య ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో స్త్రీ సాధికార చట్టాలపై మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంఏ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎస్పీ ఆకే రవికృష్ణ, జూనియర్ సివిల్ జడ్జి గంగాభవాని, సీనియర్ న్యాయవాది వి.నాగలక్ష్మి తదితరులు పాల్గొని కుటుంబ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించటం –2005, వివాహిత మహిళలపై హింస, హిందూ వివాహ చట్టం–1955, విడాకులు తదితర అంశాలతో పాటు ఉచిత న్యాయం గురించి వివరించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు నడుచుకోవాల్సిన పద్ధతులు, నిర్భయ చట్టం గురించి అవగాహన కల్పించారు.
Advertisement
Advertisement