ప్రతీకాత్మక చిత్రం
మా నాయిన సోలిపేట రామకృష్ణారెడ్డి 12 ఎక రాలకు ఆసామి. పంట విత్తనంలోనే ఉంది’ అని నమ్మే రైతు. కోతకొచ్చిన పంట చేలోంచి మెండైన కంకులు ఏరించి మరుసటి ఏడాదికి విత్తనంగా దాచి పెట్టేవారు. మా నాయిన పండించిన వరి విత్తనాలను మా ఊరు రైతులు ఎగబడి ఎగబడి కొనేటోళ్లు. ఇçప్పుడీ పద్ధతి పల్లెల్లో చూద్దామన్నా కనిపించటం లేదు. సాంప్రదాయ విత్తనాల స్థానంలోకి అధికో త్పత్తి హైబ్రీడ్, జన్యుమార్పిడి విత్తనాలు చొర బడ్డాయి. ఇవ్వాళ పంట పొలంలో నాటుతున్న ఒక్కొక్క జన్యు మార్పిడి విత్తనం భవిష్యత్తులో మందు పాతరను మించిన మహా విస్ఫోటనమై మహా విపత్తును సృష్టించబోతున్నాయి.
పత్తితో పాటు, మనుషులు ఆహారంగా తీసుకునే మిరప, వంగ, టమాట, నువ్వులు, వేరుశెనగ వంటి కూర గాయలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో జన్యు మార్పిడి విత్తనాలు వచ్చేశాయి. పర్యావరణ విఘాతం ఏర్పడుతుందనే కారణంతో వాణిజ్యప రంగా ఉత్పత్తి చేయటాన్ని దేశంలో నిషేధించారు. యూరోపియన్ దేశాలు కూడా బీజీ3ని నిషేధిం చాయి. జీవ వైవిధ్యాన్ని ఎలాంటి రూపంలోనైనా ప్రభావితం చేసే విత్తనాలకు దేశంలోకి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ గత ఏడాది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాల్లో బోల్‌గార్డు 3 విత్తనాలు సాగైనట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు పరిశోధనలు చేసిన విత్తనా లను సర్టిఫై చేసి వాణిజ్యపరంగా ఉత్ప త్తికి విడుదల చేసేవాళ్లు, గ్లోబలైజేషన్‌తో వచ్చిన సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విత్తన రంగం బాధ్యతల నుంచి తప్పుకొని బహుళజాతి సంస్థ లçకు అప్పగించాయి. ఫలితంగానే నేడు విత్తనంపై బహుళజాతి సంస్థల పెత్త నమే కొనసాగుతున్నది. ఇప్పటికీ మనం 1955, 1966 నాటి సరళమైన పాత విత్తన చట్టాలనే వాడుతున్నాం. 52 ఏళ్లు గడిచిపోయినా కొత్త విత్తన చట్టాలను రూపొందించు కోవాల్సిన అవసరం లేదా? 1966 విత్తన చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ రూపొందించిన విత్తన చట్టం– 2004 ముసాయిదా నేటికీ పార్లమెంటులో పెండింగ్‌లోనే ఉంది. దేశంలోని 75 శాతం మంది రైతాంగం కోరుకుంటున్న సమగ్ర విత్తన చట్టాలు అమల్లోకి రాకుండా ఆపు తున్నది ఎవరో బహిరంగ రహస్యమే. ప్రస్తుతం రాష్ట్రంలో మోన్‌శాంటో, డూపా యింట్, కార్గిల్, సింజెంటా కంపెనీలు 60 శాతం విత్తనాలపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. మరో 9 సంస్థలు మిగిలిన మార్కెట్‌ను గుప్పిట పట్టాయి.
ఇప్పటి వరకు లభించిన వ్యవసాయ శాఖ నివే దికల ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు 31.06 కోట్ల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 9.80 కోట్ల ఎకరాల్లో, నూనె గింజలు 6.62 కోట్ల ఎకరాల్లో, పత్తి 5.45 కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 397 విత్త నోత్పత్తి, విత్తన ప్రాసెసింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్‌లో 20 లక్షల క్వింటాళ్ళు ఆహార, పప్పు, నూనె గింజల విత్తనాలు, ఒక కోటికి పైగా పత్తి విత్తనాలు, రబీలో 8 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం.
కొత్త విత్తన చట్టాలు అమల్లోకి రాకపోగా.. బహుళ జాతి సంస్థలు పాత విత్తన చట్టాల్లో ఉన్న కొన్ని కఠినమైన క్లాజుల్లో మార్పులు తెచ్చేవిధంగా ప్రభు త్వంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ఉత్పత్తి చేసే కంపెనీయే తన విత్తనానికి ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ ఇచ్చు కునే వెసులుబాటు కల్పించారు. దీంతో పత్తి విత్త నాల అక్రమసాగుకు అడ్డు లేకుండాపోయింది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేసే పత్తి పంటలోకి నిషేధిత బీజీ3 విత్తనాలను చొప్పించటానికి ఓ రాచ మార్గం ఏర్పడింది. ఫలితంగా ఆ పంటలను మేసిన పశువులు మరణించడం, చేలో పనిచేసిన వారికి గర్భస్రావాలు, చర్మవ్యాధులు సోకినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన బీజీ3 విత్తనాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రస్థాయిలో ఒక సమగ్రమైన విత్తన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చే పనిలో నిమగ్నమ యింది. నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై పీడీ యాక్టు ప్రయోగించే విధంగా నిబంధ నలు అమల్లోకి తెచ్చారు.
సోలిపేట రామలింగారెడ్డి , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141
Comments
Please login to add a commentAdd a comment