జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ | district jail sudden visit | Sakshi
Sakshi News home page

జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ

Published Thu, Feb 16 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

district jail sudden visit

కర్నూలు : కర్నూలు శివారులోని పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని పరిసరాలను, గదులను ఖైదీలకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, పి.నిర్మల, నాగమణి, జైలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement