‘వర్తమాన న్యాయ సమస్యలు- విశ్లేషణ’తో కూడిన 53 వ్యాసాల సంకలనం ఇది. ‘సమాజ నిర్మాణంలో విడదీయరాని చట్ట వ్యవస్థ’ గురించి బాగా అవగాహన ఉండే ఓ న్యాయమూర్తి వీటిని రాయడం,
పేజీలు: 238 వెల: 100
ప్రతులకు: రచయిత, 305, అలేఖ్య రెసిడెన్సీ, వెజిటబుల్ మార్కెట్, నల్లకుంట, హైదరాబాద్-44. ఫో: 9989621103
పుస్తకం : లా లోచనం (వ్యాసాలు)
రచన : వేదాంతం సీతారామావధాని
విషయం : ‘వర్తమాన న్యాయ సమస్యలు- విశ్లేషణ’తో కూడిన 53 వ్యాసాల సంకలనం ఇది. ‘సమాజ నిర్మాణంలో విడదీయరాని చట్ట వ్యవస్థ’ గురించి బాగా అవగాహన ఉండే ఓ న్యాయమూర్తి వీటిని రాయడం, అదీ ఆయన స్వయంగా కవి కూడా కావడం పుస్తకానికి అదనపు ఆకర్షణ.
అపార్టుమెంట్ల అగచాట్లు, సహజీవనం, ‘కుంతీపుత్రులు’, పితృత్వ పరీక్షలు, నల్లధనం అరికట్టడంలాంటి అంశాలు ఇందులో వస్తాయి. ప్రభుత్వోద్యోగులు సమ్మె చేయటం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతీ, వివాహితతో లైంగిక సంబంధం నెరిపే వ్యక్తి శిక్షార్హుడన్న హెచ్చరికా, ఇప్పుడున్న కోర్టుల సామర్థ్యంతో పెండింగ్ కేసులకు మోక్షం కలిగించడానికి 320 ఏళ్లు పడుతుందన్న వాస్తవమూ తారసపడతాయి. ‘పాత గడియారాలకు వలె న్యాయ యంత్రాంగానికీ తరచూ తైల సంస్కరణ జరగాలి. అయితే దాని కాలపు విలువలను మార్చరా’దని లార్డ్ ఓల్ఫ్ అన్నట్టుగా, మూల విలువలకు భంగం కలగని సంస్కరణలు జరగాలన్న అభిలాష రచయితది.
అవిశ్రాంత కథకుడి సంకలనం
పేజీలు: 108 వెల: 72
ప్రతులకు: 3-169-16, రామారావు కాలనీ, మదనపల్లె.
ఫో: 08571 221963
పుస్తకం : టి ఎస్ ఎ కథ-2012
జానర్ : ఫిక్షన్
రచన : టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి
విషయం : అరవై నాలుగేళ్ల టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి నలభై రెండేళ్లుగా కథలు రాస్తున్నారు. ఆరు కథాసంపుటాలు, రెండు నవలలు ప్రచురించారు. ‘టిఎస్‌ఎ కథ- 2012’ ఆయన ఆరవ కథా సంపుటం. ఈ పుస్తకం కవర్ చూడగానే ఈయనో కాలక్షేపం కథకుడు అనిపించడం పాఠకుడి తప్పు కాదు; అలా అనిపించి కథల్లోకి అడుగుపెట్టకపోవడం మాత్రం పాఠకుడి తప్పే. ఇందులో ఈ సంవత్సరం వివిధ పత్రికల్లో అచ్చయిన ‘మనుషులు మరణిస్తారు’, ‘చద్దిపెట్టె’, ‘విలువ’, ‘ఆత్మబంధువు’, ‘గుండెమంట’ లాంటి పది కథలున్నాయి. నిరాడంబరమైన చదువ చక్కని వాక్యం; లేశమాత్రం సహనాన్ని పరీక్షించబూనని కథనం. ఎదుటివాడి కష్టం, అసహాయత, ఆవేదన, దుఃఖం తరపున నిలబడి రాయగలిగినతనమున్న కథకుడి కథలివి.
కవిత్వపు పరామర్శ
పేజీలు: 208; వెల: 200
ప్రతులకు: డా.ఎన్.గోపి, ఇం.నం.13-1/5బి, శ్రీనివాసపురం,
రామంతపూర్, హైదరాబాద్-13.
ఫోన్: 040-27037585
పుస్తకం : అరుణ కవిత్వం - అవలోకనం
జానర్ : నాన్‌ఫిక్షన్/వ్యాసాలు
సంపాదకురాలు : డా.నీరజ జవ్వాజి
విషయం : సాధారణంగా కవిత్వం ఒక ఉద్రేకం, ఒక తక్షణ స్పందనం. ఎన్.అరుణ విషయంలో ఇది తారుమారు. ఆమె యాభై దాటిన తర్వాతే రాయడం మొదలుపెట్టారు. సంసార బాధ్యతల్ని ఒక ఒడ్డుకు చేర్చాక, ఒడిదుడుకుల చిలిపితనం, దుడుకుతనం చవిచూశాక కలాన్ని సిరాలో ముంచడం మొదలుపెట్టారు. ఆ లెక్కన ఆమెకు కవిత్వం అంటే సంయమనం, సమన్వయం. నీరజ అన్నట్టు, ‘ఆవేశం, ఆగ్రహానికి మధ్య గల సంయమనరేఖ మీద నిలబడి అన్ని రకాల వాదాలను, ధోరణులను సమన్వయం’ చేస్తారు.
పదేళ్ల కాలంలో అరుణ ఏడు కవితా సంకలనాలు- ‘మౌనమూ మాట్లాడుతుంది’ ‘పాటల చెట్టు’ ‘గుప్పెడు గింజలు’(నానీలు), ‘అమ్మ ఒక మనిషి’, ‘హృదయమే వదనం’ ‘సూది నా జీవనసూత్రం’ ‘‘నిరీక్షణే ఒక గాయం’- వెలువరించారు. వాటన్నింటిమీదా వచ్చిన విమర్శల సంకలనం ఇది. ఆమెది ‘శాంతిని పంచే కవిత్వం’గా కందుకూరి రమేష్‌బాబు భావిస్తారు. ‘ఎన్నో ఏళ్లుగా సుప్తించిన చేతన భళ్లున మేల్కొన్న కవిత్వ జీవనది’గా పెన్నా శివరామకృష్ణ అభివర్ణిస్తారు. రచయిత్రి హృదయ సాంద్రతకు కొలమానంగా కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆమె ఈ కవితను ఉదాహరిస్తారు: ‘జీవితం ప్రసాదించిన/కన్నీటి చుక్కను/ పదిలంగా లోపల దాచుకున్నాను/ ఆ తడే లేకపోతే/ గుండె ఎప్పుడో బీటలు వారిపొయ్యేది.’
కొత్త పుస్తకాలు
అమృతమూర్తి ముహమ్మదు (దివ్యచరితము- పద్యకావ్యము-ప్రథమ భాగము)
రచన: ఎస్.ఎస్.పటేల్
పేజీలు: 144; వెల: 75
ప్రతులకు: రచయిత, 80/80ఎ, చౌడేశ్వరి నగర్, విక్టరీ ఫంక్షన్ హాల్ వెనుక, కర్నూలు-518002. ఫోన్: 9441376145
చింతల చెట్టు (కవిత్వం)
రచన: సింహాద్రి పద్మ
పేజీలు: 82; వెల: 50
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్
కాలం మరణించింది
రచన: డి.రామచంద్రరాజు
పేజీలు: 176; వెల: 150
ప్రతులకు: డి.సుజాత, డోర్ నం: 4/1979-2, బాలమురుగన్ వీధి, చిత్తూరు-517002.
పుడమి తల్లి పులకించింది
రచన: ఆచంట వీరవెంకట సత్యసాయి కుమార్
పేజీలు: 96; వెల: 50
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు