'పోటీ చేయాలంటే విద్యార్హతలు ఉండాల్సిందే' | Education Compulsory To Fight Panchayat Polls: Supreme Court Backs Haryana Law | Sakshi
Sakshi News home page

'పోటీ చేయాలంటే విద్యార్హతలు ఉండాల్సిందే'

Published Thu, Dec 10 2015 1:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'పోటీ చేయాలంటే విద్యార్హతలు ఉండాల్సిందే' - Sakshi

'పోటీ చేయాలంటే విద్యార్హతలు ఉండాల్సిందే'

ఢిల్లీ: పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులకు తగిన విద్యార్హతలు ఉండాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాలలో అక్షరాస్యత, పరిశుభ్రత మెరుగుపడతాయన్న వాదనతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది.

హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జనరల్ కేటగిరీ వారికి 10 వ తరగతి, మహిళలు, దళితులకు 8 వ తరగతి, దళిత మహిళలకు కనీసం 5 వతరగతి విద్యార్హతలను అనివార్యం చేసింది. ఈ చట్టంతో గ్రామాల్లోని 84 శాతం దళిత మహిళలు, 71 శాతం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా మారుతున్నారని ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న హక్కును ఈ చట్టం కాలరాస్తుందన్న సంస్థ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో కొంతైనా మార్పు వస్తుందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement