న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరై, పరిస్థితిని వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొంది
ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్‌లతో కూడిన ధర్మాసనం దేశాలు ఇచ్చింది. కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించింది
కాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదని పేర్కొంది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment