సుప్రీంకోర్టులో వంటమనిషి కుమార్తె ప్రతిభ : ప్రశంసల వెల్లువ | CJI DY Chandrachud Felicitates Pragya Daughter Of Cook In SC | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో వంటమనిషి కుమార్తె ప్రతిభ : ప్రశంసల వెల్లువ

Published Wed, Mar 13 2024 3:26 PM | Last Updated on Wed, Mar 13 2024 3:54 PM

ఫోటో కర్టసీ పీటీఐ - Sakshi

సుప్రీంకోర్టులో వంటమనిషి కుమార్తె ప్రగ్యా  

అమెరికాలో  లాలో మాస్టర్స్ చదివేందుకు స్కాలర్‌షిప్‌

సీజేఐ  డీవై చంద్రచూడ్‌ ప్రశంసలు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంట మనిషి పుత్రికోత్సాహంతో  మునిగి తేలు తున్నారు. తనను చదివించడానికి నాన్న కష్టాన్ని గమనించిన ఆయన కుమార్తె ప్రగ్యా పట్టుదలతో చదివింది. అమెరికాలోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదవడానికి  ఎంపిక అయింది. అంతేకాదు  స్కాలర్‌షిప్ కూడా సాధించింది. దీంతో   ప్రగ్యా తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రగ్యా తల్లిదండ్రులను సత్కరించారు.  ప్రగ్యా ప్రతిభను కొనియాడారు. ఆమెకు స్వీట్లు అందించారు. దీంతో అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. ఉన్నత చదువులకు కష్టపడి ముందుకు వెళ్లాలను కుంటే, అందుకున్న సంబంధిత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాన న్యాయమూర్తి  సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement