ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్‌జీపీటీకి భారీ షాక్ తగిలింది. 2022 నవంబర్‌లో మార్కెట్‌లో విడుదలైన నాటి నుంచి తొలిసారి ఆ యాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు వినియోగదారుల్లో కృత్తిమ మేధ టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ టూల్స్ వినియోగించడంలో ఆసక్తి తగ్గడానికి సంకేతమని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
చాట్‌జీపీటీ! టెక్నాలజీ యుగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఒక చాట్‌బోట్. చాట్‌జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గత ఏడాది నవంబర్‌లో యూజర్లకు పరిచయం చేసింది. ప్రారంభంలో ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా రికార్డ్‌లను నమోదు చేసింది. గూగుల్‌లాంటి దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతూ రాకెట్ వేగంతో ప్రపంచాన్ని చుట్టేసేంతలా కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ఒక్క జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది దీన్ని వినియోగించినట్లు యూబీఎస్ రీసెర్చ్ వెల్లడించింది. ఇతర యాప్‌లు ఈ మైలురాయిని చేరటానికి దాదాపుగా రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు.
సిమిలర్ వెబ్ నివేదికలో
సిమిలర్ వెబ్ నివేదిక ప్రకారం..చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మే - జూన్ నెలలో కాలంలో ఏఐ యూజర్లు 9.7శాతం పడిపోయారు. సందర్భాన్ని బట్టి అవసరం కోసం చాట్‌జీపీటీని వాడుకునే యూనిక్ విజిటర్స్ సైతం 5.7 శాతం తగ్గారు. అమెరికాలో చాట్‌జీపీటీ పరిస్థితి మరింత దారుణంగా పడిపోతుంది. ఇక్కడ నెలవారీగా 10.3 శాతం మంది యూజర్లు ఉపయోగించుకోవడమే మానేశారు. అంతేకాదు, వెబ్‌సైట్‌లో సందర్శకులు గడిపిన సమయం కూడా 8.5శాతం తగ్గినట్లు సిమిలర్ వెబ్ నివేదిక పేర్కొంది.
ట్రాఫిక్ సైతం పడిపోయింది
ఆ రిపోర్ట్‌ను నిశితంగా పరిశీలిస్తే, నవంబర్ 2022లో ప్రారంభించినప్పటి నుండి వృద్ది (పెరగడం) తటస్థంగా కొనసాగుతూ వచ్చింది. విజిట్ చేసే యూజర్ల సంఖ్య ఫిబ్రవరి - మార్చి నెలల్లో 10 బిలియన్ల నుంచి 15 బిలియన్లకు చేరింది. విచిత్రంగా ఏప్రిల్ -మే’లలో గ్రోత్ రేట్ తగ్గింది. యూనిక్ విజిటర్స్ సైతం పెరిగినట్లు సిమిల్ వెబ్ నివేదిక చెబుతోంది.
అంచనాలు తప్పాయ్
చాట్‌జీపీటీ నెలవారీ యూజర్లు 20 బిలియన్ల నెలవారీ ట్రాఫిక్ మార్కును దాటుతుందని ప్రారంభ అంచనాలు చెప్పినప్పటికీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. వెబ్ సైట్ ప్రారంభ సమయంలో అందులో యూజర్లు గడిపిన సమయం 6 నిమిషాలే. మార్చి నెలలో 8 నిమిషాల కంటే ఎక్కువ. ప్రస్తుతం 8 నిమిషాల్లోపే ఉంది.
ఇతర టూల్స్ సైతం
ట్రాఫిక్ తగ్గుదల చాట్ జీపీటీ మాత్రమే కాకుండా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ కేరక్టర్. ఏఐ సైతం ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిమిలర్ వెబ్ నివేదిక హైలెట్ చేసింది. ఈ ఏడాది మే నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్న క్యారక్టర్. ఏఐ యూజర్లు మే నుంచి జూన్ మధ్య కాలంలో తగ్గుముఖం పట్టారు. గతంలో క్యారక్టర్.ఏఐలో యూజర్లు గడిపే సమయం 25.4 నిమిషాల నుంచి 8.5 శాతానికి చేరింది.
యూజర్లు పడిపోవడానికి కారణం
అయితే, ఏఐ టూల్స్‌కు వినియోగదారులు తగ్గడానికి ప్రధాన కారణం వాటిపై నమ్మకం కోల్పోవడమేనని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా చాట్‌జీపీటీ వంటి టూల్స్‌లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర ఏఐ టూల్స్ తయారీ సంస్థలు తమకు పరిష్కారం చూపించమని యూజర్లు వాటిని అడిగితే.. తప్పుడు సమాచారం అందించి.. తాము అందించింది సరైందేనని నమ్మించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోడింగ్ తయారు చేసే సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
నమ్మకం కోల్పోతుంది
మరోవైపు, సున్నితమైన కంపెనీ డేటాను చాట్‌జీపీటీ టూల్స్‌తో పంచుకోవడం వల్ల సంస్థ రహస్యాలు బహిర్ఘతం అవుతాయేయమోనన్న ఆందోళనతో చాలా కంపెనీలు చాట్‌జీపీటీని వినియోగించడంలో నిషేధించాయి. ఈ సందర్భంగా యూజర్లు తగ్గడంపై.. ‘ఓ మై గాడ్ ఇది అద్భుతం’ అని బిల్డర్. ఏఐ సీఈవో సచిన్ దేవ్ దుగ్గల్ అన్నారు. చాట్‌జీపీటీ యాప్స్‌ను రూపొందించడంలో ఉపయోగపడుతుంది. కానీ,యాప్స్‌లలో తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారంటూ యూజర్లు సంస్థలపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో చాట్‌జీపీటీ వినియోగం బాగుంది. కానీ రాను రాను దాని అవసరం తగ్గిపోతున్నట్లు గ్రహించినట్లు దుగ్గల్ చెప్పారు.
చదవండి👉 ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు!
Comments
Please login to add a commentAdd a comment