చాట్‌జీపీటీ(ChatGPT)ని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఫిబ్రవరి 5న భారత్‌కు వస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కలవడంతోపాటు పరిశ్రమ పెద్దలతో చర్చాగోష్టిలో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో ఆయన భారత్‌కు రావడం ఇది రెండవసారి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఓపెన్‌ఏఐ ఆధిపత్యాన్ని చైనాకు చెందిన డీప్‌సీక్ అకస్మాత్తుగా సవాలు చేసిన ఈ తరుణంలో ఆల్ట్‌మాన్ భారత్ సందర్శన ఆసక్తిగా మారింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవిస్తున్న శక్తివంతమైన ఏఐ మోడళ్ల గురించి సందేహాలను ఆయన 2023లో వ్యక్తం చేసిన వీడియో ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని కాపీరైట్ ఉల్లంఘనల దావాలకు సంబంధించిన కేసులతో సహా భారత్‌లో చట్టపర అడ్డంకులను ఓపెన్‌ఏఐ ఎదుర్కొంటున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్‌ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని, విచారించడానికి భారతీయ న్యాయస్థానాలకు అధికార పరిధి లేదని ఓపెన్‌ఏఐ వాదించింది.
ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
డీప్ రీసెర్చ్ ఆవిష్కరణ..
చాట్‌జీపీటీలో ఇటీవల డీప్ రీసెర్చ్ ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ ఆవిష్కరించింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment