co founder
-
ఉన్నట్టుండి.. తప్పుకొన్న జొమాటో కోఫౌండర్
జొమాటో సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా సంస్థ నుంచి తప్పుకొన్నారు. కంపెనీలో 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పనిచేసిన ఆమె ఉన్నట్టుండి వైదొలిగారు. ఆకృతి చోప్రా రాజీనామా చేసినట్లు జొమాటో సెప్టెంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది."దీపీ (దీపిందర్ గోయల్).. చర్చించినట్లుగా ఈరోజు సెప్టెంబర్ 27 నుండి అధికారికంగా నా రాజీనామాను పంపుతున్నాను. ఇది 13 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం. ప్రతిదానికీ ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను " అని చోప్రా తన ఎగ్జిట్ మెయిల్లో రాసుకొచ్చారు. దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ అప్లోడ్ చేసింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..బ్లింకిట్ సీఈవో అయిన అల్బిందర్ ధిండా సతీమణే ఈ ఆకృతి చోప్రా. జొమాటోలో ఇటీవల అగ్రస్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరుగా సంస్థను వీడుతున్నారు. వీరి సరసన ఇప్పుడు చోప్రా కూడా చేరారు. కోఫౌండర్ మోహిత్ గుప్తా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత 2023 జనవరిలో మాజీ సీటీవో గుంజన్ పాటిదార్ బయటకు వెళ్లిపోయారు.దాదాపు అదే సమయంలో జొమాటో న్యూ ఇనీషియేటివ్స్ హెడ్, ఫుడ్ డెలివరీ మాజీ చీఫ్ రాహుల్ గంజూ, ఇంటర్సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ కూడా నిష్క్రమించారు. పాటిదార్, పంకజ్ చద్దా, గౌరవ్ గుప్తా, మోహిత్ గుప్తా తర్వాత సుమారు రెండేళ్లలో కంపెనీ నుండి నిష్క్రమించిన ఐదో కో ఫౌండర్ చోప్రా. వీరిలో చద్దా 2018లో, గౌరవ్ గుప్తా 2021లో సంస్థను విడిచి వెళ్లారు. -
రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో పరిచయమైనా పరిచమైన 'అసిన్' గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ ఈమె భర్త 'రాహుల్ శర్మ' గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈయన ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త.. వేలకోట్ల సామ్రాజ్యానికి అధినాయకుడు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ. ఈయన తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ను స్థాపించారు. ప్రారంభంలో ఇది ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ.. ఆ తరువాత 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 210 నాటికి హ్యూ జాక్మాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తక్కువ ధరలోనే ఫోన్లను అందించే సంస్థగా భారతదేశపు అగ్రగామిగా మారింది.రాహుల్ శర్మ రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం (Saskatchewan University) నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకున్నారు.చదువు పూర్తయిన తరువాత రాహుల్ శర్మ తన తండ్రి నుంచి రూ. 3 లక్షలు అప్పుగా తీసుకుని బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు ఈయన నికర విలువ ఏకంగా రూ. 1300 కోట్లు. ఈయన మైక్రోమ్యాక్స్‌తో పాటు.. 2017లో భారతదేశపు మొట్టమొదటి ఏఐ బేస్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ ఫౌండర్ కూడా.రాహుల్ శర్మ 2016లో నటి 'ఆసిన్'ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇప్పుడు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది. వీరు ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. వీరికి బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, బీఎండబ్ల్యూ ఎక్స్6, మెర్సిడెస్ జీఎల్450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. -
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
‘నిద్ర’కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్!
ఒకరోజు నిద్ర పట్టక రకరకాలుగా ఆలోచిస్తుంటే... ‘నిద్ర’కు సంబంధించిన స్టార్టప్ ఐడియా తట్టింది ప్రియాంక సలోత్కు. ఆ రాత్రి వచ్చిన ఐడియా తనని ‘ఉద్యోగి’ స్థాయి నుంచి ‘ది స్లీప్’ కంపెనీ ద్వారా ‘ఎంటర్ప్రెన్యూర్’గా మార్చింది. దిండు నుంచి పరుపుల వరకు పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో ‘ది స్లీప్ కంపెనీ’ రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకతను చాటుకున్నాయి.రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాకు చెందిన ప్రియాంక సలోత్ స్కూల్ రోజుల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చింది. అంతా కొత్త కొత్తగా అనిపించింది. అయితే అదేమీ తనని భయపెట్టలేదు. ఉత్సాహాన్ని ఇచ్చింది. హిందీ మీడియంలోలాగే ఇంగ్లిష్ మీడియంలోనూ చదువులో దూసుకుపోయింది. ఐఐఎం కోల్‌కత్తాలో చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.యంగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయినæప్రియాంక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌తో కెరీర్ప్రారంభించింది. ఆ తరువాత సింగపూర్‌లో వేరే కంపెనీలో చేరింది. కొన్ని నెలల తరువాత... కన్సల్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రోల్స్ తనకు సరికాదేమో అనిపించింది. నిజానికి ఈ రియలైజేషన్ అనేది ప్రియాంకకు ఇదే మొదటిసారి కాదు.దిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ‘షూడాగ్’ ‘స్టీవ్ జాబ్స్’ పుస్తకాల ప్రభావంతో ‘సాంకేతిక రంగంలో ఉండాలనుకోలేదు. ఇంజినీర్ కావాలనుకోలేదు. మరి నేనెందుకు ఇంజినీరింగ్ చేస్తున్నాను?’ అని తనని తాను ప్రశ్నించుకుంది. చాలామంది టాపర్స్లాగే ‘ఇంజనీరింగ్ లేదా మెడిసిన్’ అని ఆలోచించి ఇంజినీరింగ్ చేస్తుందే తప్ప ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే మేనేజేమెంట్ విషయాలపై తనకు ఉన్న ఆసక్తితో మేనేజ్మెంట్ కోర్సు చేసింది.సింగపూర్ నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘పీ అండ్ జీ’లో చేరి కన్సూ్యమర్ బ్రాండ్స్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఏరియల్ డిటర్జంట్ బ్రాండ్‌లో పనిచేసిన తరువాత బేబీ డైపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘΄ాంపర్స్’ హెడ్‌గా నియామకం అయింది. ఆ తరువాత... ప్రెగ్నెన్సీ వల్లప్రొఫెషనల్ లైఫ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ‘ఉద్యోగం కాదు సొంతంగా ఏదైనా వ్యా΄ారం చేయాలి’ అనే ఆలోచన ఆమెలో పెరిగి పెద్దదైంది. అదే సమయంలో చిన్న భయం కూడా మొదలైంది. ‘పెద్ద జీతాన్ని కాదనుకొని వ్యా΄ారం చేస్తే... ఎన్నో రిస్కులు ఎదురవుతాయి. వృత్తిజీవితంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు?’ అనిపించింది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె కంఫర్ట్ జోన్ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది.ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలాంటి ఒక రాత్రి వచ్చిన ఆలోచనే... ది స్లీప్ కంపెనీ. తనలాగే ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే ‘స్లీప్ అండ్ కంఫర్ట్’ బిజినెస్‌కు సంబంధించి మంచి అవకాశం ఉంది అనిపించింది. తన స్టార్టప్ ఐడియా మిత్రులకు నచ్చలేదు. మళ్లీ ‘రిస్క్’ అనే భయం ముందుకు వచ్చింది. అయితే ఆ భయాన్ని వెనక్కి నెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఐడియాపై సంవత్సరానికి పైగా పనిచేసింది.డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన మాజీ ఉద్యోగి ఏకే త్రి΄ాఠీతో కలిసి హైటెక్–్ర΄ాడక్ట్ రూపకల్పన చేసింది. తరువాత భర్త హర్షిల్ సలోత్తో కలిసి ‘ది స్లీప్ కంపెనీ' ప్రారంభించింది. ప్రియాంక బిజినెస్ ఐడియా సక్సెస్ అవుతుందని నమ్మినవారి సంఖ్య తక్కువ. అయితే పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ‘ది స్లీప్ కంపెనీ’ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంది. మొదట్లో రకరకాల సవాళ్లు ఎదురైనా కంపెనీకి సంబంధించిన ఫండింగ్ జర్నీ సాఫీగా సాగింది. పెద్ద సంస్థలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మ్యాట్రస్ బ్రాండ్ నుంచి స్లీప్ అండ్ కంఫర్ట్ టెక్ సొల్యూషన్ కంపెనీగా ఎదిగింది ది స్లీప్ కంపెనీ.వెయ్యి ఫెయిల్యూర్స్ తరువాత...‘ది స్లీప్ కంపెనీ’ లాంచ్ చేయడానికి ముందుప్రాడక్ట్స్కు సంబంధించి వెయ్యికి పైగా ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలం అయ్యాయి. ఈ పరాజయాలు ఒక దశలో నన్ను నిరాశలోకి నెట్టి ‘ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు చేశానా?’ అని సందేహించేలా చేశాయి. ఫండ్ రైజింగ్ క్రమంలో ‘మీప్రాడక్ట్లో కొత్త ఏం ఉంది’ అంటూ రిజెక్షన్స్ మొదలయ్యాయి. ‘ఇక వెనక్కి వెళదాం’ అని ఆ సమయంలో అనుకొని ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు పెద్ద విజయం దక్కేది కాదు. – ప్రియాంక సలోత్, కో–ఫౌండర్, ది స్లీప్ కంపెనిఇవి చదవండి: Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం! -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి
కన్న కలను నిజం చేసుకోవడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. దాని కోసం నిరంతర ప్రయత్నం, అంకిత భావం చాలా అవసరం. ఇవన్నీ తోడైనప్పుడు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang). ఇంతకీ ఈయనెవరు? ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. 1963లో తైవాన్‌లోని తైనాన్‌లో జెన్సన్ హువాంగ్ జన్మించారు. ఈయన కుటుంబం అతనికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే.. థాయిలాండ్‌కు మకాం మార్చారు. తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని మేనమామతో కలిసి వాషింగ్టన్‌లోని టాకోమాకు వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే హువాంగ్ ఒకప్పుడు డెన్నీ రెస్టారెంట్లో సర్వర్‌గా పనిచేసేవారు. ఆ తరువాత క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్లతో కలిసి 1993లో 'ఎన్విడియా' (Nvidia) స్థాపించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో సీఈఓగా జెన్సన్ హువాంగ్ వేతనం 24.6 మిలియన్ డాలర్లు. దీంతో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక జీతం తీసుకునే 61వ వ్యక్తిగా నిలిచారు. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. సర్వర్‌గా పనిచేసిన జెన్సన్ హువాంగ్ ప్రస్తుతం 64.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. ఈయన కంపెనీ క్యాపిటలైజేషన్ 1.83 ట్రిలియన్లు లేదా రూ. 15100000 కోట్ల కంటే ఎక్కువ. ఒక సర్వర్ స్థాయి నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాలో నిలిచే వరకు ఎదిగారంటే దాని వెనుక ఆయన కృషి, పట్టుదల ఇట్టే అర్థంపైపోతుంది. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్
భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎవరికి వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి.. కొత్త కొత్త ఆలోచనలతో బాగా సంపాదిస్తూ కోటీశ్వరుగా మారుతున్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు EaseMyTrip ట్రావెల్ వెబ్సైట్ కో-ఫౌండర్ 'రికాంత్ పిట్టి'. ఈయన ఇటీవల ఖరీదైన 'లంబోర్ఘిని' కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే (Lamborghini Urus Performante) నివేదికల ప్రకారం.. రికాంత్ పిట్టి కొనుగోలు చేసిన కారు 'లంబోర్ఘిని' కంపెనీకి చెందిన 'ఉరుస్ పెర్ఫార్మంటే'. దీని ధర రూ. 4.2 కోట్లు కావడం గమనార్హం. మన దేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు బాగా ఇష్టపడే కార్ల జాబితాలో ఇది ఒకటి. ఈ కారు కొనుగోలు చేసిన సందర్భంగా రికాంత్ లింక్డ్ఇన్లో చాలా పెద్ద పోస్ట్ షేర్ చేసాడు. ఇందులో అతని 16 సంవత్సరాల వయస్సులో తన సోదరుడితో తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడో వివరించాడు. ఆ తరువాత 20 సంవత్సరాల వయసు నాటికి EaseMyTrip వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇది క్రమంగా వృద్ధిలోకి వచ్చింది. అనేక సంవత్సరాల కృషి తర్వాత, ఈజీమైట్రిప్ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీగా అవతరించింది. లంబోర్ఘిని కారుని సొంతం చేసుకోవడం 19 ఏళ్లప్పుడు కన్న కల అని రికాంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే 2021లో ఈ కారుని కొనుగోలు చేసి ఉండొచ్చని, ఆ సమయంలో కరోనా బాధితుల సహాయం కోసం నిధులను ఉపయోగించడం వల్ల అది కుదరలేదని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇది కేవలం కారు మాత్రమే కాదు, మన కష్టార్జితాన్ని, మనం సాకారం చేసుకున్న కలలను, వెంటాడుతున్న కలలను సూచిస్తుందని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో ఇక లంబోర్ఘిని విషయానికి వస్తే, ఇది 2022లో దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది 4.0-లీటర్ V8, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 666 పీఎస్ పవర్ & 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ SUV దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
అడోబ్ కోఫౌండర్ జాన్ వార్నాక్ కన్నుమూత
అమెరికన్ మల్టీనేషనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ (Adobe) సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ (John Warnock) కన్నుమూశారు. జాన్ వార్నాక్ 82 సంవత్సరాల వయసులో శనివారం (ఆగస్టు 19) మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వార్నాక్ మరణానికి కారణం వెల్లడించలేదు. వార్నాక్ 1982లో చార్లెస్ గెష్కేతో కలిసి శాన్ జోస్ కేంద్రంగా అడోబ్ కంపెనీని ప్రారంభించారు. 2000 సంవత్సరం వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 2001లో పదవీ విరమణ చేసే వరకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. వార్నాక్ 2017 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఎక్కువ కాలం గెష్కేతో కలిసి సంయుక్తంగా ఆ పదవిలో కొనసాగారు. వార్నాక్ మరణించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగారు. గెష్కే 2021లో 81 ఏళ్ల వయసులో మరణించారు. జాన్ వార్నాక్‌తో కలిసి మెలిగిన గత 25 సంవత్సరాల కాలం వృత్తిపరంగా తన కెరీర్లో అత్యంత కీలకమైందని అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ ఉద్యోగులకు రాసిన ఒక ఈమెయిల్లో పేర్కొన్నారు. వార్నాక్ తన రోల్ మోడల్, మెంటర్ అని, అంతకన్నా ఎక్కువగా ఒక మంచి స్నేహితుడిగా ఆయన్ను భావిస్తానని తెలిపారు. అడోబ్‌ని స్థాపించడానికి ముందు వార్నాక్ జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేశారు. వార్నాక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. గణితశాస్త్రంలో మాస్టర్స్ చేసిన ఆయన గణితం, తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. వార్నాక్కు భార్య మార్వా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ కొత్త బిజినెస్.. సీఈవో కోసం అన్వేషణ!
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది. సీఈవో కోసం అన్వేషణ సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్కార్ట్కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు. విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు. -
‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’
బెంగళూరుకు చెందిన ఫామ్‌పే అనే స్టార్టప్ సంస్థ ఒకేసారి 18 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా ప్రకటించారు. హైపర్-గ్రోత్ నుంచి సస్టైనబిలిటీకి తమ ఫోకస్ మారడం వల్ల తొలగింపులు తప్పడం లేదని ఫామ్‌పే కో ఫౌండర్ సంభవ్ జైన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేశారు. అయితే తాము తొలగించిన సిబ్బందికి ఎవరైనా జాబ్ ఇవ్వాలని రిక్రూటర్లను అభ్యర్థించాడు ఆ ఫిన్‌టెక్ యాప్ సహ వ్యవస్థాపకుడు. ఇక మరో కో ఫౌండర్ కుష్ తనేజా కూడా సంభవ్ జైన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినవారు కొత్త జాబ్ పొందేలా సహాయం చేయాలని కోరారు. ‘ఈరోజు చాలా కఠినమైన రోజు. ఎందుకంటే 18 మంది ఉద్యోగులను వదులుకోవాల్సి వచ్చింది. ఓ ఫౌండర్‌గా ఇది నాకు చాలా కష్టమైన పని. ఉద్యోగులను వదులుకోవడం తమలాంటి ‘పీపుల్ ఫస్ట్’ సంస్థలకు అంత సులభం కాదు’ అని సంభవ్ జైన్ ట్వీట్ చేశారు. తాను, తనేజా సంవత్సరాలుగా తాము నిర్మించుకున్న జట్టు గురించి చాలా గర్విస్తున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు తగిన జాబ్‌లను తాము అందించలేకపోయామన్నారు. వీరిని ఎవరైనా నియమించుకోవాలని కోవాలని కోరారు. తనేజా కూడా ట్వీట్ చేస్తూ 18 మంది ఉద్యోగులను విడిచిపెట్టవలసి వచ్చినందున ఈ రోజు తమకు చాలా విచారకరమైన రోజు అని పేర్కొన్నారు. ఫామ్‌పే సంస్థను నిర్మించడంలో వారి సహకారానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలని ఇందు కోసం తమను సంప్రదించాలని రిక్రూటర్లను అభ్యర్థించారు. అయితే వీరి పోస్ట్‌లపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వీరిని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. Today was an extremely sad day for us as 18 of our FamStars had to leave 😔 We are forever grateful to their contributions in building the Fam! Please DM if you are looking for super passionate and extraordinary folks for your team https://t.co/fmQTH90xP8 — Kush (@iamkushtaneja) August 2, 2023 -
ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్ సరిపోదంటున్నారు ఐఐటీయన్, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. విభిన్నమైన జాబ్లకు విభిన్న రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్మెంట్ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్‌లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్బుక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్ ట్విటర్ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఇదీ చదవండి ➤ లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? ఐఐటీలో ఇంటర్న్‌షిప్, ప్లేస్మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్లకు విభిన్న వెర్షన్ల రెజ్యూమ్‌లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, అదే డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్‌ల కోసమైతే మీ డెవలప్మెంట్ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్‌ల గురించి రెజ్యూమ్‌లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. విభిన్న రెజ్యూమ్‌లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్‌కుమార్ అన్నారు. కాగా సౌరభ్‌కుమార్ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. In IIT during internship/placement season we were often told to keep multiple versions of our resume Different resume for different kind of company or role you’re applying for For instance, having different resumes for different roles such as Dev based roles Quant based… — Saurabh Kumar (@drummatick) July 16, 2023 -
ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి
Ola Cabs Co-Founder Ankit Bhati: ఓలా క్యాబ్ సర్వీస్ అనగానే భవిష్ అగర్వాల్ గుర్తుకు వస్తారు. అయితే దీని స్థాపించడంలో మరొక వ్యక్తి హస్తం కూడా ఉంది. అతడే ఓలా క్యాబ్ సర్వీస్ కో ఫౌండర్ 'అంకిత్ భాటి' (Ankit Bhati). అతి తక్కువ వయసులోనే బిలీనియర్ అయిన ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఐఐటీ చేసిన గ్రాడ్యుయేట్లు దేశంలో అనేక వ్యాపారాలు చేసి సక్సెస్ సాధించారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు అంకిత్ భాటి. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కంపెనీ స్థాపనలో పాలుపంచుకుని విజయం సాధించిన అంకిత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇతడు మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ కోడింగ్‌లో నిపుణుడు. ఓలా క్యాబ్ సర్వీస్ ప్రారంభించడానికి ముందు మైక్రోసాఫ్ట్, మేక్ సెన్స్, విల్కామ్ వంటి అనేక సంస్థలలో పనిచేశారు. 2010లో ఓలా క్యాబ్స్ ప్రారంభమైంది. ఇది కేవలం ఐదు సంవత్సరాల నాటికి వేలకోట్లు టర్నోవర్ తీసుకువచ్చింది. ఈ కారణంగానే భవిష్ అండ్ అంకిత్ ఇద్దరూ కూడా అతి తక్కువ కాలంలో బిలీనియర్స్ అయిన యువకుల జాబితాలో స్థానం పొందారు. (ఇదీ చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) ఎనిమిది సంవత్సరాల ముందు అంకిత్ నికర విలువ సుమారు రూ. 3000 కోట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. కాగా ఇప్పుడది రూ. 938 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. ప్రస్తుతం ఉబర్ సంస్థకు గట్టి పోటీ ఇస్తున్న ఓలా క్యాబ్ సర్వీస్ మంచి లాభాల బాటలో పయనిస్తోంది. సంస్థ సీఈఓగా భవిష్, సిటీఓగా (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) అంకిత్ ఉన్నారు. -
మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
ప్రపంచాన్ని మరో కొత్త మాంద్యం చుట్టుముడుతుందట.. అదే ‘స్నేహ మాంద్యం’ (friendship recession). ప్రముఖ స్టాక్ బ్రోకరింగ్ సంస్థ జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, ఇటీవలే తన సోదరుడు, వ్యాపార భాగస్వామి నితిన్‌తో కలిసి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో చేరిన నిఖిల్ కామత్ ఈ మాట అన్నారు. జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను ఇలా గుర్తు చేశారు. ఒంటరితనం, స్నేహ బంధానికి సంబంధించి అమెరికన్ పర్స్పెక్టివ్స్ సర్వే గ్రాఫిక్ చిత్రాలను నిఖిల్ కామత్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఆప్యాయతను పంచే మిత్రులు, సంక్షోభ సమయాల్లో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్నేహితులు తగ్గిపోవడాన్ని స్నేహ మాంద్యంగా ఆ చిత్రాల్లో పేర్కొన్నారు. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం అని కూడా అందులో రాసి ఉంది. తనకు సోదరులలాంటి ఐదుగురు స్నేహితులు ఉన్నారని, వారి కోసం తాను ఏదైనా చేస్తానని నిఖిల్ కామత్ వెల్లడించారు. స్నేహ బంధం జీవితాన్ని మారుస్తుందన్నారు. ఈ ట్వీట్లో ఆయన స్నేహానికి సంబంధించిన విషయాలతోపాటు మానవ సంబంధాలు, వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేశారు. వీటికి సంబంధించిన వివరణాత్మక గ్రాఫ్‌ను షేర్ చేశారు. The more #philosophy you read (not stoic), having a community seems to be the biggest precursor to #happiness (as fleeting as it might be). I have 5 bros in my life I would do all for, life-changing this is, seriously ♥️ pic.twitter.com/jMxVDKs031 — Nikhil Kamath (@nikhilkamathcio) May 26, 2023 ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ యునికార్న్ భారత్‌పే-తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై క్రిమినల్ కేసు, సివిల్ దావా దాఖలు చేసింది. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై రూ. 88.67 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని భారత్ పే డిమాండ్ చేసింది. ఇది చదవండి: రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్ దాదాపు 2,800 పేజీల ఫిర్యాదులో భారత్‌పే గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ బిల్లుల చెల్లింపు, కంపెనీకి సేవలు అందించడానికి కల్పిత విక్రేతల సృష్టి, రిక్రూట్మెంట్ కోసం కంపెనీకి అధిక చార్జీ వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు గ్రోవర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నైపథ్యం ఇదీ.. నైకా ఐపీఓ కోసం నిధులను పొందడంలో విఫలం కావడానికి సంబంధించి కోటక్ గ్రూప్ ఉద్యోగిపై గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ అనుచిత పదజాలం ఉపయోగించి, బెదిరించిన కేసులో ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు సంవత్సరాల భారత్‌పే వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితిల్లో సంస్థ కార్పొరేట్ పాలన సమీక్షను నిర్వహించడానికి, గ్రోవర్ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడో లేదో తెలుసుకోవడానికి అల్వారెజ్ మార్సల్, శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్, పీడబ్ల్యూసీలను భారత్‌పే నియమించింది. ఇది మార్చిలో కంపెనీ, ఆ సంస్థ బోర్డు నుండి గ్రోవర్, ఆయన భార్య తొలగింపునకు దారితీసింది. వారితోపాటు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉద్యోగులందరిపై చర్యలు తీసుకో వాలని సంస్థ నిర్ణయించింది. అష్నీర్ గ్రోవర్ నిరోధిత షేర్లను వెనక్కి తీసుకోవడంసహా, ఆయన పా ల్పడిన అవకతవకలపై చర్యలకూ ఉపక్రమించింది. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు -
భారత్‌పేకు మరో షాక్, కీలక కో-ఫౌండర్ ఔట్!
సాక్షి, ముంబై: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేకు మరో షాక్ తగిలింది.సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే రెండో వ్యవస్థాపకుడు భావిక్ కొలాదియా సంస్థకు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇప్పటికే నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఇబ్బందులు పడుతున్న భారత్‌పే కంపెనీకి, కంపెనీ ఐటీ బ్యాక్‌బోన్‌గా ఉన్న కిలాదియా వైదొలిగారు. ఆయన కాంట్రాక్ట్ పదవీకాలం జూలై 31, 2022తో ముగిసిందని, అయితే కంపెనీ వీడేందుకే కొలాదియా నిర్ణయించుకున్నారని కంపెనీ ఆగస్టు 2న ఒక ప్రకటనలో తెలిపింది.అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా మారిన కృషిన ఆయన అంతర్భాగంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని నమ్ముతున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు భారత్‌పే తన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటని, రానున్న కాలంలో కూడా పెట్టుబడులు కొనసాగిస్తానని కొలాడియా చెప్పారు. పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే భారత్‌పేని స్థాపించిన రోజు నుంచి తాను, శాశ్వత్ భారత్‌పే, స్థాపించడంతోపాటు, దాని అభివృద్ధికి కృషి చేశామని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కంపెనీ BharatPeకి సహ వ్యవస్థాపకుడు, ఎంపీ అష్నీర్ గ్రోవర్ కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అష్నీర్ గ్రోవర్ రాజీనామా తర్వాత భారత్‌పే బోర్డు ఆయనతో పాటు ఆయన భార్య కంపెనీ నిధుల్లో భారీ అవకతవకలు చేసిన ఆరోపణలు, తర్వాత బోర్డు గ్రోవర్ మధ్య వివాదం చివరికి గ్రోవర్ రాజీనామాకు దారి తీసింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రోవర్, భరత్‌పే మేనేజ్మెంట్ మధ్య వివాదం చెలరేగినప్పుడు, కొలాడియా, గ్రోవర్ మధ్య వాగ్వాదం ఆడియో రికార్డ్ బయటపడటం కలకలం రేపింది. అటు మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం, కీలక ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా కంపెనీకి గుడ్ బై చెప్పారు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుడు సత్యం నాథనిగత జూన్‌లో రాజీనామా చేశారు. ప్రధాన రెవెన్యూ అధికారి నిషిత్ శర్మ సంస్థాగత రుణ భాగస్వామ్య అధిపతి చంద్రిమా ధర్ నిష్క్రమించారు. ఆ తరువాత కొద్ది రోజులకే మరో కీలకమైన టెక్ నిపుణుడు నథాని కంపెనీని వీడారు. -
ఆల్ట్ న్యూస్ జుబేర్ అరెస్ట్.. రాహుల్, ఒవైసీ ఖండన
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మొహమ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి.. కస్టడీకి తరలించారు. నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టును కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్లు శశిథరూర్, జైరాం రమేష్‌లతో పాటు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. లాయర్, ఉద్యమవేత్త ప్రశాంత్ భూషణ్ సైతం.. ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. ఆయన్ని మరొక కేసులో అరెస్ట్ చేశారని జుబేర్ సహ ఉద్యోగి, ఆల్ట్ న్యూస్ మరో సహవ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ఆరోపిస్తున్నారు. 2020లో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించేందుకు పిలిచారు. ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు సైతం రక్షణ ఇచ్చింది. అయితే.. తీరా అక్కడికి వెళ్లాక పోలీసులు కొత్త కేసును తెర మీదకు తెచ్చారు. పైగా అది నాలుగేళ్ల కిందటిది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జుబైర్‌ను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఏ ఎఫ్ఐఆర్ మీద అరెస్ట్ చేశారో చెప్పమంటే.. కనీసం కాపీ కూడా చూపించట్లేదు అని సిన్హా ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. Arrest of @zoo_bear is highly condemnable. He’s been arrested with no notice & in some unknown FIR. Total violation of due process. @DelhiPolice does nothing about anti-Muslim genocidal slogans but acts swiftly against “crime” of reporting hate speech & countering misinformation — Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2022 Every person exposing BJP's hate, bigotry and lies is a threat to them. Arresting one voice of truth will only give rise to a thousand more. Truth ALWAYS triumphs over tyranny. #DaroMat pic.twitter.com/hIUuxfvq6s — Rahul Gandhi (@RahulGandhi) June 27, 2022 Please note. pic.twitter.com/gMmassggbx — Pratik Sinha (@free_thinker) June 27, 2022 -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్‌గా.. చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది. పతా.. అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు
కాబూల్: తాలిబన్ల మధ్య అంతర్గతంగా జరిగిన ఘర్షణలో తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధానమంత్రి అబ్దుల్ ఘనీ బరాదర్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ల అధికారిక వెబ్సైట్లలో ఈ ఆడియోను పోస్టు చేశారు. తనకు ఏమీ కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం దారుణమని విమర్శించారు. పుకార్లు సృష్టించడం మానుకోవా లని హితవు పలికారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అధికారాన్ని పంచుకొనే విషయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన లో బరాదర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. -
వికీపీడియాపై సంచలన వ్యాఖ్యలు చేసిన కో-ఫౌండర్..!
మనకు ఏదైనా కావాల్సిన విషయంపై మరింత సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ను అడిగేస్తాము. గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే. మనం సెర్చ్ చేసే విషయాలకు సంబంధించిన వాటిని గూగుల్ చూపిస్తోంది. ఇంటర్నెట్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలంటే మనలో చాలా మంది ఎన్సైక్లోపీడియా వికీపీడియాను ఉపయోగిస్తాం. వికీపీడియాతో పలు విషయాలను తెలుసుకొని మన సందేహాలను నివృత్తి చేసుకుంటాం. మనలో చాలా మంది వికీపీడియాలో చూశాం కదా..!అని కచ్చితంగా ఆయా సమాచారం నిజమై ఉంటుందని అనుకుంటాం. తాజాగా వికీపీడియా అందించే సమాచారంపై లారీ సాంగెర్ మాట్లాడారు. నమ్మదగిన సోర్స్ కాదు..! వికీపీడియా అందించే సమాచారం సరియైనదా..కాదా..! అనే విషయంపై వికీపీడియా కో ఫౌండర్ లారీ సాంగెర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికీపీడియా సైట్ అందించే సమాచారం నమ్మదగిన సోర్స్‌గా భావించరాదని హెచ్చరించారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను చేశారు. అంతేకాకుండా వికీపీడియాను గత కొన్ని రోజులుగా కొంత మంది తమ స్వప్రయోజనాలకోసం, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వికీపీడియా అనేది ఒక ఓపెన్ సోర్స్ సైట్. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై వికీపీడియాలో ఉన్న ఆర్టికల్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ ఆర్టికల్‌లో జో బైడెన్‌పై రిపబ్లికన్ల దృష్టికోణం తక్కువగా కనిపిస్తుంది. రిపబ్లికన్ల కోణంలో జో బైడెన్‌పై ఆర్టికల్ దొరకదని పేర్కొన్నారు. నిర్దిష్ట విషయాల గురించి వ్యాఖ్యలు చేయడానికి, వాటి సమాచారాన్ని సైట్లో ఉంచేందుకు పలు కంట్రిబ్యూటర్స్‌ను వికీపీడియా అనుమతిస్తుంది. అంటే నిర్ధిష్ట విషయాలపై సమాచారాన్ని అందించే సమాచారం కంట్రిబ్యూటర్ల దృష్టికోణంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. వారు అందించే సమాచారం ఎల్లప్పుడు వాస్తవంగా ఉండదన్నారు. వారు అందించే సమాచారంపై వికీపీడియా ఓ కంట చూస్తోందని పేర్కొన్నారు. వికీపీడియా ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలుసు. దీంతో కొంతమంది చెప్పే సమాచారం వెనుక పెద్ద గేమ్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. వికీపీడియా ఎల్లప్పుడు నిజమైన సమాచారాన్నే ఇస్తుందనీ నమ్మొచ్చా...! అంటే అది నిజమైన సమాచారామా..కాదా! అనేది యూజర్లపై ఆధారపడి ఉంటుందని లారీ సాంగెర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
పిజ్జా హట్ కో ఫౌండర్ ఇక లేరు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అనేక మంది ప్రముఖులను పొట్టన పెట్టుకుంటోంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న తరువాత వృద్దుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు. గత దశాబ్ద కాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న కార్నీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. కానీ ఆ తరువాత న్యుమోనియా వ్యాధి సోకింది. దీంతో పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారని అతని భార్య, సోదరుడు ప్రకటించారు. (కరోనా: జైపూర్ మాజీ మహారాజా కన్నుమూత) 1958లో సోదరుడు డాన్ (26) తో కలిసి అమెరికా, కాన్సాస్ రాష్ట్రంలోని విచితాలో 19 ఏళ్ల వయసులో పిజ్జా హట్ సామ్రాజ్యాన్ని ప్రారంభించారు ఫ్రాంక్ కార్నె. వారి తల్లిదండ్రులనుంచి అప్పుగాతీసుకున్న 600 డాలర్లతో ప్రారంహించిన సంస్థ అంచలంచెలుగా వృద్ధిని సాధించి దిగ్గజ సంస్థగా అవతరించింది. ఈ నేపథ్యంలో 1977లో పిజ్జా హట్‌ను 300 మిలియన్ డాలర్లకు పెప్సికో కొనుగోలు చేసింది. ఆ తరువాత ఇతర ఆహార సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, వినోద వ్యాపారాలతో సహా వివిధ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు. కాగా అమెరికాలో కరోనా మహమ్మారి ప్రకంపనలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలలో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ఆసుపత్రులకు చేరుతున్న బాధితుల సంఖ్య ప్రస్తుతం లక్షకు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 2731 మంది మహమ్మారికి బలయ్యారు. కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది. -
వన్‌ప్లస్‌కు భారీ షాక్!
వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సంస్థను వదిలి వెళ్లిపోవచ్చనే వార్తలు వినిబడుతున్నాయి. పీ తన సొంత వెంచర్ ప్రారంభించడానికి కంపెనీని విడిచిపెట్టినట్లు కథనాలు వెలువెడుతున్నాయి. వన్‌ప్లస్ 8టీ ఈ నెల 14న విడుదల చేయనుండగా ఇప్పుడు పీ వెళ్లిపోవడం సెన్సెషన్‌గా మారింది. దీనిపై వన్‌ప్లస్ నుంచి కానీ కార్ల్ పీ దగ్గర నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేకాకుండా పీ ట్విట్టర్ ఖాతా బయోలో ఇప్పటికీ #NewBeginnings @oneplus అనే ఉంది. అయితే ఈ విషయాన్ని రెడ్డిట్ యూజర్ జోన్సిగుర్ తన ఖాతా ద్వారా తెలిపారు. వన్‌ప్లస్ ఈ మెయిల్స్‌లా కనిపించే ఫోటోలను షేర్చేశారు. వీటిలో కార్ల్ పీ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ఉంది. అయితే అందులో కార్ల్‌పీ డిజిగ్నేషన్ గురించి ఎక్కడ ప్రస్తవించలేదు. ఇకపై కార్ల్‌పీ స్థానంలో ఎమిలీడై వన్‌ప్లస్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. చైనాలోని షెన్జెన్ ఆధారంగా వన్‌ప్లస్‌ను పీట్ లా, కార్ల్ పీ 2013లో స్థాపించారు. ఈ తరువాత వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. చదవండి: వన్‌ప్లస్ సర్ప్రైజ్; తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు -
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు పౌల్ అలెన్ (65) కన్నుమూశారు. కొంతకాలంగా నాన్ హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 2009లో ఈ వ్యాధి బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. కానీ మళ్లీ రెండు వారాల క్రితమే ఆ వ్యాధి మరింత తీవ్రం కావడంతో పౌల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ వ్యస్థాపకుడు బిల్ గేట్స్, సీఈవో సత్య నాదెళ్ల , ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సహా పలువురు టెక్ నిపుణులు పౌల్ మృతిపై ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలిపారు, ముఖ్యంగా బిల్‌గేట్స్ తన మిత్రుడి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచం ఒకగొప్ప టెక్నాలజీ మార్గదర్శకుడిని కోల్పోయిందన్నారు. కాగా 1975లో బిల్ గేట్స్, పౌల్ అలెన్‌లు మైక్రోస్టాఫ్ సంస్థను స్థాపించారు. ఈ ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. దానగుణంలోనూ బిల్ గేట్స్‌కు సాటిగా నిలిచారు పౌల్. మైక్రోసాఫ్ట్ సంస్థ కార్పొరేట్ స్థాయికి ఎదగడానికి ముందే, 1983లోనే గేట్స్‌తో వచ్చిన విభేదాల కారణంగాపౌల్ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగారు. Our industry has lost a pioneer and our world has lost a force for good. We send our deepest condolences to Paul’s friends, the Allen family and everyone at Microsoft. — Tim Cook (@tim_cook) October 15, 2018 We lost a great technology pioneer today - thank you Paul Allen for your immense contributions to the world through your work and your philanthropy. Thoughts are with his family and the entire Microsoft community. — Sundar Pichai (@sundarpichai) October 15, 2018 Deeply saddened by the passing of @PaulGAllen. I’ll miss him greatly. His gracious leadership and tremendous inspiration will never be forgotten. The world is a better place because of Paul’s passion, commitment, and selflessness. His legacy will live on forever. — Pete Carroll (@PeteCarroll) October 15, 2018 -
టెకీలకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని యాపిల్ సహవ్యవస్ధాపకులు స్టీఫెన్ వొజ్నిక్ అన్నారు. ఈ టెక్నాలజీతో ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని భరోసా ఇచ్చారు. కృత్రిమ మేథపై పనిచేసేందుకు మనకు మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారని అన్నారు. రాబోయే తరానికి ఎంచుకునేందుకు భిన్న ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాను మెషీన్లను డిజైన్ చేసినప్పటికీ వాటిని మార్కెట్ చేసేందుకు స్టీవ్ జాబ్స్ లాంటి ఎంట్రెప్రెన్యూర్ అవసరమని ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ప్రోగ్రామర్, ఫిలాంత్రపిస్ట్ వొజ్నిక్ యాపిల్ తొలిరోజులను గుర్తుచేసుకున్నారు. జాబ్స్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ..అతనితో తానెప్పుడూ వాదనకు దిగలేదని, మా ఇద్దరి మధ్య కొన్నివిషయాల్లో బిన్నాభిప్రాయాలున్నా..జాబ్స్ తన పట్ల చాలా గౌరవంగా వ్యవహరించే వాడన్నారు. తన ఫేవరేట్ గాడ్జెట్ యాపిల్ వాచ్ అని చెప్పుకొచ్చారు. -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన కంపెనీ సీఈవో!
ఒకప్పుడు అతను ఓ ప్రముఖ కంపెనీ సీఈవోగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అనుకోకండి. అతనేమీ బిజినెస్‌లో నష్టపోయి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయటం లేదు. మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాడంతే. ఫ్లైట్లకు సంబంధించిన సమాచారంతో పాటు విహార యాత్రలకు సంబంధించిన.. హోటల్స్ తదితర సేవలు అందించే 'కాయక్' వెబ్సైట్ కో ఫౌండర్ పాల్ ఇంగ్లిష్.. 2012లో సుమారు 1400 కోట్లకు కాయక్‌ను ప్రిన్స్లైన్ సంస్థకు అమ్మేశాడు. ఆ తరువాత ఉబర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్‌గా చేరాడు. అయితే క్యాబ్ డ్రైవర్ డ్రెస్‌లో ఉన్నా ఇంగ్లిష్‌ను మాత్రం కస్టమర్లు ఈజీగానే గుర్తుపడుతున్నారట. అంతేకాదు.. క్యాబ్ డ్రైవర్‌గా కస్టమర్లకు ఎంత బాగా సేవలందించినా ఫైవ్ స్టార్ రేటింగ్ రాలేదని వాపోతున్నాడు. 4.97 స్టార్ రేటింగ్ క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న ఇంగ్లిష్.. తనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వని కస్టమర్ ఎందుకు అసంతృప్తితో ఉన్నాడా అని ఆలోచిస్తున్నాడట. పాల్ ఇంగ్లిష్ ఇటీవలే ఓ కొత్త సంస్థను ప్రారంభించారు. లోలా పేరుతో ప్రారంభించిన ఆ వెంచర్లో ట్రావెల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ట్రావెల్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకు లోలా ఉపయోగపడుతోందని ఇంగ్లిష్ వెల్లడించారు. దీని కోసం ఇంగ్లిష్ స్వయంగా క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తి మరీ వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రాజెక్ట్ వర్క్ చేశాడన్నమాట.