సాక్షి, న్యూఢిల్లీ : కృత్రిమ మేథతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని యాపిల్ సహవ్యవస్ధాపకులు స్టీఫెన్ వొజ్నిక్ అన్నారు. ఈ టెక్నాలజీతో ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని భరోసా ఇచ్చారు. కృత్రిమ మేథపై పనిచేసేందుకు మనకు మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారని అన్నారు. రాబోయే తరానికి ఎంచుకునేందుకు భిన్న ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు.
తాను మెషీన్లను డిజైన్ చేసినప్పటికీ వాటిని మార్కెట్ చేసేందుకు స్టీవ్ జాబ్స్ లాంటి ఎంట్రెప్రెన్యూర్ అవసరమని ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ప్రోగ్రామర్, ఫిలాంత్రపిస్ట్ వొజ్నిక్ యాపిల్ తొలిరోజులను గుర్తుచేసుకున్నారు. జాబ్స్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ..అతనితో తానెప్పుడూ వాదనకు దిగలేదని, మా ఇద్దరి మధ్య కొన్నివిషయాల్లో బిన్నాభిప్రాయాలున్నా..జాబ్స్ తన పట్ల చాలా గౌరవంగా వ్యవహరించే వాడన్నారు. తన ఫేవరేట్ గాడ్జెట్ యాపిల్ వాచ్ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment