ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా ఇప్పటికే పలు కంపెనీల్లో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రాబోయే పదేళ్లలో చాలా సంస్థల్లో 9 టూ 5 ఉద్యోగాలు (ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే ఉద్యోగాలు) కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్‌మన్ పేర్కొన్నారు.
ఏఐ కారణంగా కంపెనీలు మనుషులతో చేయించుకునే పనిభారం తగ్గించుకుంటాయి. పని వేగాన్ని పెంచుకుంటాయి. వర్క్‌ఫోర్స్ విధానంలో గణనీయమైన మార్పులు ఏర్పడతాయి. అయితే డేటా భద్రతకు సమ్వబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీడ్ హాఫ్‌మన్ వెల్లడించారు.
రీడ్ హాఫ్‌మన్ గతంలో అంచనా వేసిన చాలా అంశాలు నిజమయ్యాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలు రాకముందే.. 1997లోనే సోషల్ మీడియా, షేరింగ్ ఎకానమీ, ఏఐ విప్లవం పెరుగుదలను హాఫ్‌మన్ ఊహించినట్లు తపారియా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 1934 నాటికి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment