‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు: రాహుల్‌గాంధీ | Rahulgandhi Key Comments On Artificial Intelligence | Sakshi
Sakshi News home page

‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు: రాహుల్‌గాంధీ

Published Mon, Sep 9 2024 1:29 PM | Last Updated on Mon, Sep 9 2024 1:47 PM

Rahulgandhi Key Comments On Artificial Intelligence

టెక్సాస్‌: కృత్రిమ మేధ(ఏఐ)తో నిరుద్యోగం ఏర్పడుతుందన్న వాదనను ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొట్టి పారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త తరహా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. ఆదివారం(సెప్టెంబర్‌8) అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు.

‘క్యాలి​క్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినపుడు ఇలానే ఉద్యోగాలు పోతాయన్నారు. ఏమైంది. కొత్త ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏం నష్టం జరగలేదు. అయితే ఏఐతో భారత్‌లో ప్రధానంగా ఐటీ రంగం సమస్య ఎదుర్కోబోతోంది. అదే సమయంలో స్కూటర్లు తయారు చేసే బజాజ్‌ కంపెనీకి ఏఐతో సమస్యేమీ లేదు. 

ఏఐ ఒక్కో రంగాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోయేలా చేస్తుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనం సరిగ్గా వాడుకుంటే ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తుంది’అని రాహుల్‌గాంధీ అభిప్రాయపడ్డారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు. 

ఇదీ చదవండి: రాహుల్‌గాంధీ పప్పు కాదు: శామ్‌ పిట్రోడా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement