నేడు( ఆగస్ట్ 25న) న్యూ ఢిల్లీలో ప్రారంభమైన మూడు రోజుల B20 సమ్మిట్ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి, B20 చైర్ నటరాజన్ చంద్రశేఖరన్ భారతదేశ పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అభివృద్ధి ప్రయాణం ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఇది తక్కువ లేదా నైపుణ్యం లేని ఎక్కువ మందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి సాధికారత నిస్తుందన్నారు. B20 సమ్మిట్ ఇండియా 2023లో జరిగిన ప్యానెల్ చర్చలో, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, భారతదేశం టెక్నో-లీగల్ విధానాన్ని తీసుకోవడం ద్వారా డేటా గోప్యత, రక్షణకు సంబంధించి "అద్భుతమైన పురోగతి"ని సాధించిందన్నారు.
గత డిసెంబర్‌లో 2023కి బి20 చైర్‌గా ఎంపికైన చంద్రశేఖరన్ ప్రధానమంత్రి గతి శక్తి పథకం, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాలు, తక్కువ కార్పొరేట్ పన్నులు, సాలిడ్ డిజిటల్ వంటి అనేక అంశాలు ప్రస్తుతం దేశ వృద్ధిని నడిపిస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ లాంటి జి20 దేశాలలో భారత్ బుల్లిష్ ధోరణికి సహాయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఏఐ వాస్తవానికి మనలాంటి దేశంలో, ఉద్యోగాలను సృష్టిస్తుందనీ, ఎందుకంటే ఇది తక్కువ నైపుణ్యం లేదా నైపుణ్యం లేని వ్యక్తులను మరింత శక్తివంతం దనీ, వారికున్న సమాచార నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయగలరన్నారు. దీనికి ఒక నర్సు ఉద్యోగాన్ని ఉదాహరణగా చెప్పారు. ఏఐ ద్వారా నర్సు ఒక వైద్యుని పనిభారాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు. అయితే దీని వివిధ మార్కెట్‌లలో మరియు సమాజంలోని వివిధ విభాగాలలో భిన్నంగా ఉంటుందన్నారు. అయితే ప్రతిచోటా (AI) ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇది ఉన్నత స్థాయి ఉద్యోగాలతో ప్రజలను శక్తివంతం చేస్తుందని చంద్రశేఖరన్ నొక్కిచెప్పారు.
దేశంలో వందల మిలియన్ల మంది ప్రజలకు ఏఐ అందుబాటులోకి రావాలనేది తమ భావన అనీ, ప్రజలు మార్కెట్‌లోకి రాబోతున్న 250 - 300 మిలియన్ల మందిరానున్నారి చెప్పారు. వీటికి ఏఐ సేవల్ని వినియోగిస్తే మొత్తం GDPని ప్రభావితం చేస్తుందని, అలాగే వారి తలసరి ఆదాయం పెరుగడం లాంటి చాలా ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. అలాగే ఇండియా ఐటీ చట్టంద్వారా డేటా గోప్యత, రక్షణ విషయంలో భారతదేశం పెద్ద పురోగతిని సాధించిందని, మరోవైపు తాము సృష్టించిన DEPA(ప్రైవేట్ యాప్స్‌కి అవసరమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్చర్) రెండూ కలిసి పని చేయడం మంచి పరిణామమన్నారు. కాగా G 20 18 వ సదస్సు భారతదేశం వేదికగా 2023 September లో జరగబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment