మనకు ఏదైనా కావాల్సిన విషయంపై మరింత సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా ఏదైనా సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ను అడిగేస్తాము. గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే. మనం సెర్చ్ చేసే విషయాలకు సంబంధించిన వాటిని గూగుల్ చూపిస్తోంది. ఇంటర్నెట్‌లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలంటే మనలో చాలా మంది ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాను ఉపయోగిస్తాం. వికీపీడియాతో పలు విషయాలను తెలుసుకొని మన సందేహాలను నివృత్తి చేసుకుంటాం. మనలో చాలా మంది వికీపీడియాలో చూశాం కదా..!అని కచ్చితంగా ఆయా సమాచారం నిజమై ఉంటుందని అనుకుంటాం. తాజాగా వికీపీడియా అందించే సమాచారంపై లారీ సాంగెర్ మాట్లాడారు.
నమ్మదగిన సోర్స్ కాదు..!
వికీపీడియా అందించే సమాచారం సరియైనదా..కాదా..! అనే విషయంపై వికీపీడియా కో ఫౌండర్ లారీ సాంగెర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికీపీడియా సైట్ అందించే సమాచారం నమ్మదగిన సోర్స్‌గా భావించరాదని హెచ్చరించారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను చేశారు. అంతేకాకుండా వికీపీడియాను గత కొన్ని రోజులుగా కొంత మంది తమ స్వప్రయోజనాలకోసం, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వికీపీడియా అనేది ఒక ఓపెన్ సోర్స్ సైట్. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై వికీపీడియాలో ఉన్న ఆర్టికల్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ ఆర్టికల్‌లో జో బైడెన్‌పై రిపబ్లికన్ల దృష్టికోణం తక్కువగా కనిపిస్తుంది. రిపబ్లికన్ల కోణంలో జో బైడెన్‌పై ఆర్టికల్ దొరకదని పేర్కొన్నారు.
నిర్దిష్ట విషయాల గురించి వ్యాఖ్యలు చేయడానికి, వాటి సమాచారాన్ని సైట్‌లో ఉంచేందుకు పలు కంట్రిబ్యూటర్స్‌ను వికీపీడియా అనుమతిస్తుంది. అంటే నిర్ధిష్ట విషయాలపై సమాచారాన్ని అందించే సమాచారం కంట్రిబ్యూటర్ల దృష్టికోణంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. వారు అందించే సమాచారం ఎల్లప్పుడు వాస్తవంగా ఉండదన్నారు. వారు అందించే సమాచారంపై వికీపీడియా ఓ కంట చూస్తోందని పేర్కొన్నారు. వికీపీడియా ఇప్పుడు ప్రపంచంలో ఎంతో ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలుసు. దీంతో కొంతమంది చెప్పే సమాచారం వెనుక పెద్ద గేమ్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. వికీపీడియా ఎల్లప్పుడు నిజమైన సమాచారాన్నే ఇస్తుందనీ నమ్మొచ్చా...! అంటే అది నిజమైన సమాచారామా..కాదా! అనేది యూజర్లపై ఆధారపడి ఉంటుందని లారీ సాంగెర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment