జొమాటో సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా సంస్థ నుంచి తప్పుకొన్నారు. కంపెనీలో 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పనిచేసిన ఆమె ఉన్నట్టుండి వైదొలిగారు. ఆకృతి చోప్రా రాజీనామా చేసినట్లు జొమాటో సెప్టెంబర్ 27న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది.
"దీపీ (దీపిందర్ గోయల్).. చర్చించినట్లుగా ఈరోజు సెప్టెంబర్ 27 నుండి అధికారికంగా నా రాజీనామాను పంపుతున్నాను. ఇది 13 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణం. ప్రతిదానికీ ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను " అని చోప్రా తన ఎగ్జిట్ మెయిల్‌లో రాసుకొచ్చారు. దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ అప్‌లోడ్ చేసింది.
ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..
బ్లింకిట్ సీఈవో అయిన అల్బిందర్ ధిండా సతీమణే ఈ ఆకృతి చోప్రా. జొమాటోలో ఇటీవల అగ్రస్థాయి ఉద్యోగులు ఒక్కొక్కరుగా సంస్థను వీడుతున్నారు. వీరి సరసన ఇప్పుడు చోప్రా కూడా చేరారు. కోఫౌండర్ మోహిత్ గుప్తా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత 2023 జనవరిలో మాజీ సీటీవో గుంజన్ పాటిదార్ బయటకు వెళ్లిపోయారు.
దాదాపు అదే సమయంలో జొమాటో న్యూ ఇనీషియేటివ్స్ హెడ్, ఫుడ్ డెలివరీ మాజీ చీఫ్ రాహుల్ గంజూ, ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్ కూడా నిష్క్రమించారు. పాటిదార్, పంకజ్ చద్దా, గౌరవ్ గుప్తా, మోహిత్ గుప్తా తర్వాత సుమారు రెండేళ్లలో కంపెనీ నుండి నిష్క్రమించిన ఐదో కో ఫౌండర్ చోప్రా. వీరిలో చద్దా 2018లో, గౌరవ్ గుప్తా 2021లో సంస్థను విడిచి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment