ఒకరోజు నిద్ర పట్టక రకరకాలుగా ఆలోచిస్తుంటే... ‘నిద్ర’కు సంబంధించిన స్టార్టప్ ఐడియా తట్టింది ప్రియాంక సలోత్‌కు. ఆ రాత్రి వచ్చిన ఐడియా తనని ‘ఉద్యోగి’ స్థాయి నుంచి ‘ది స్లీప్’ కంపెనీ ద్వారా ‘ఎంటర్‌ప్రెన్యూర్’గా మార్చింది. దిండు నుంచి పరుపుల వరకు పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో ‘ది స్లీప్ కంపెనీ’ రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్‌లో ప్రత్యేకతను చాటుకున్నాయి.
రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాకు చెందిన ప్రియాంక సలోత్ స్కూల్ రోజుల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చింది. అంతా కొత్త కొత్తగా అనిపించింది. అయితే అదేమీ తనని భయపెట్టలేదు. ఉత్సాహాన్ని ఇచ్చింది. హిందీ మీడియంలోలాగే ఇంగ్లిష్ మీడియంలోనూ చదువులో దూసుకుపోయింది. ఐఐఎం కోల్‌కత్తాలో చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
యంగ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయినæప్రియాంక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌తో కెరీర్‌ప్రారంభించింది. ఆ తరువాత సింగపూర్‌లో వేరే కంపెనీలో చేరింది. కొన్ని నెలల తరువాత... కన్సల్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రోల్స్ తనకు సరికాదేమో అనిపించింది. నిజానికి ఈ రియలైజేషన్ అనేది ప్రియాంకకు ఇదే మొదటిసారి కాదు.
దిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ‘షూడాగ్’ ‘స్టీవ్ జాబ్స్’ పుస్తకాల ప్రభావంతో ‘సాంకేతిక రంగంలో ఉండాలనుకోలేదు. ఇంజినీర్ కావాలనుకోలేదు. మరి నేనెందుకు ఇంజినీరింగ్ చేస్తున్నాను?’ అని తనని తాను ప్రశ్నించుకుంది. చాలామంది టాపర్స్‌లాగే ‘ఇంజనీరింగ్ లేదా మెడిసిన్’ అని ఆలోచించి ఇంజినీరింగ్ చేస్తుందే తప్ప ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే మేనేజేమెంట్ విషయాలపై తనకు ఉన్న ఆసక్తితో మేనేజ్‌మెంట్ కోర్సు చేసింది.
సింగపూర్ నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘పీ అండ్ జీ’లో చేరి కన్సూ్యమర్ బ్రాండ్స్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఏరియల్ డిటర్జంట్ బ్రాండ్‌లో పనిచేసిన తరువాత బేబీ డైపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘΄ాంపర్స్’ హెడ్‌గా నియామకం అయింది. ఆ తరువాత... ప్రెగ్నెన్సీ వల్లప్రొఫెషనల్ లైఫ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో ‘ఉద్యోగం కాదు సొంతంగా ఏదైనా వ్యా΄ారం చేయాలి’ అనే ఆలోచన ఆమెలో పెరిగి పెద్దదైంది. అదే సమయంలో చిన్న భయం కూడా మొదలైంది. ‘పెద్ద జీతాన్ని కాదనుకొని వ్యా΄ారం చేస్తే... ఎన్నో రిస్కులు ఎదురవుతాయి. వృత్తిజీవితంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు?’ అనిపించింది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె కంఫర్ట్ జోన్ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది.
ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలాంటి ఒక రాత్రి వచ్చిన ఆలోచనే... ది స్లీప్ కంపెనీ. తనలాగే ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే ‘స్లీప్ అండ్ కంఫర్ట్’ బిజినెస్‌కు సంబంధించి మంచి అవకాశం ఉంది అనిపించింది. తన స్టార్టప్ ఐడియా మిత్రులకు నచ్చలేదు. మళ్లీ ‘రిస్క్’ అనే భయం ముందుకు వచ్చింది. అయితే ఆ భయాన్ని వెనక్కి నెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఐడియాపై సంవత్సరానికి పైగా పనిచేసింది.
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన మాజీ ఉద్యోగి ఏకే త్రి΄ాఠీతో కలిసి హైటెక్–్ర΄ాడక్ట్ రూపకల్పన చేసింది. తరువాత భర్త హర్షిల్ సలోత్‌తో కలిసి ‘ది స్లీప్ కంపెనీ' ప్రారంభించింది. ప్రియాంక బిజినెస్ ఐడియా సక్సెస్ అవుతుందని నమ్మినవారి సంఖ్య తక్కువ. అయితే పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ‘ది స్లీప్ కంపెనీ’ మార్కెట్‌లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంది. మొదట్లో రకరకాల సవాళ్లు ఎదురైనా కంపెనీకి సంబంధించిన ఫండింగ్ జర్నీ సాఫీగా సాగింది. పెద్ద సంస్థలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మ్యాట్రస్ బ్రాండ్ నుంచి స్లీప్ అండ్ కంఫర్ట్ టెక్ సొల్యూషన్ కంపెనీగా ఎదిగింది ది స్లీప్ కంపెనీ.
వెయ్యి ఫెయిల్యూర్స్ తరువాత...
‘ది స్లీప్ కంపెనీ’ లాంచ్ చేయడానికి ముందుప్రాడక్ట్స్‌కు సంబంధించి వెయ్యికి పైగా ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలం అయ్యాయి. ఈ పరాజయాలు ఒక దశలో నన్ను నిరాశలోకి నెట్టి ‘ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు చేశానా?’ అని సందేహించేలా చేశాయి. ఫండ్ రైజింగ్ క్రమంలో ‘మీప్రాడక్ట్‌లో కొత్త ఏం ఉంది’ అంటూ రిజెక్షన్స్ మొదలయ్యాయి. ‘ఇక వెనక్కి వెళదాం’ అని ఆ సమయంలో అనుకొని ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు పెద్ద విజయం దక్కేది కాదు. – ప్రియాంక సలోత్, కో–ఫౌండర్, ది స్లీప్ కంపెని
ఇవి చదవండి: Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం!
Comments
Please login to add a commentAdd a comment